సురవరం ప్రతాపరెడ్డి
155
ఖద్దరు సరకును ఈ రాష్ట్రమందు ఒకచోటి నుండి మరియొక చోటికి అదనపు ఖర్చేమియు లేకుండ గొనిపోవుటకు వీలుగల్గించి యున్నారు. ఇది ఖాదీ వస్త్రాలయము వారి ప్రయత్నములకు చాల తోడ్పడినది అయినను ప్రభుత్వమువారు తలచుచో తమ రాష్ట్రమందు ఖద్దరు వ్యాప్తికి ఇంకను ఎక్కువగ తోడ్పడ వచ్చునని సూచింపబడుచున్నది మైసూరు సంస్థానమందు మునిసిపాలిటీ వైద్యాలయములు మొదలగు ప్రభుత్వ సంస్థలు ఆ సంస్థానమునందు చేయింపబడిన ఖద్దరును ఉపయోగించుచు ప్రోత్సాహ మొదగుచున్నవి మైసూరు దివానగు సర్ మీర్జా ఇస్మెయిల్‌గారుకూడ మైసూరు ఖద్దరు ధరించి రెండవ గుండ్రబల్ల సభకుపోయి మార్గదర్శులైనట్లు తెలుపబడినది. ఈ విధముగ మన ప్రభుత్వము వారు గూడ ఈ రాష్ట్రమందు ఖద్దరుకెందుకు ప్రోత్సాహ మీయరాదు?
ఖద్దరన్న ఈ రాష్ట్రమందు ప్రభుత్వోద్యోగులు అనుమాన దృష్టితో చూచునట్లు తెలుపబడినది. ఇందుకు కారణమేమి? బ్రిటిషిండియాలోనన్నచో కాంగ్రెసువారు శాసనోల్లంఘనోద్యమములో చేరినవారందరు ఖద్దరు నియతముగా ధరించుటచే, ఖద్దరు ధరించు వారు శాసనోల్లంఘనమునకు ప్రోత్సాహమిచ్చుచున్నారను అనుమానము అచటి ప్రభుత్వమువారి కుండవచ్చును. మన రాష్ట్రములో కాంగ్రెసువారు అవలంబించు శాసనోల్లంఘనమే లేదు. మొదలులేని శాసనోల్లంఘనము ఖద్దరు ధరించుటచే పుట్టవచ్చునని తలచుటకు గూడ వీలులేదు బ్రిటిషు ఇండియాలో శాసనోల్లంఘనము ప్రారంభింపబడుటకు కారణమువేఱు, ఖద్దరు ధారణమేమాత్రము దానికి పురిగొల్పి యుండలేదు
ఈ విధముగ ఖద్దరు వలన ఉపద్రవము కలుగక పోవుటయేగాక దాని వలన ప్రభుత్వమునకే ఎక్కువ సుఖము గల్గును. యంత్రముల సహాయముతో గుడ్డలను తయారు చేయుచోట్ల పనివాండ్రకును యజమానులకును ఏర్పడుసంఘర్షణలును, పనివాండ్ర యొక్క దుర్భర కష్టములును ఆ చోట్లలోని ప్రభుత్వములను ఏవిధముగ చిక్కుబెట్టుచున్నవో మనము చూచుచునే యున్నాము. సంఘర్షణంలో మధ్యవర్తిత్వము చేయుట పెద్ద చిక్కు యంత్రవృద్ధివలన తుదకు పనివాండ్ర అవరసరము నానాటికి తగ్గుచుండినచో వారిలో నిరుద్యోగ మేర్పడును.అప్పుడు వారి ప్రాణరక్షణార్థమై ప్రభుత్వమువారు ఇతర దేశములలోవలె