154
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
సరకులో ఉన్ని అల్లిక సరకులు తప్ప తక్కిన ఎక్కువ భాగము తమ రాష్ట్రమందే ఉత్పన్నమైనదని నివేదికలో తెలుపబడియుండుట. మొదటి సంవత్సరము రాష్ట్రము వెలుపల నుండి తెప్పించిన సరకు వస్త్రాలయము వారు కొనిన మొత్తము సరుకులో సుమారు 5 వ వంతు మాత్రమే యుండెను. రెండవ సంవత్సరములో ఈ దిగుమతిలో సగము తగ్గెను ఖద్దరు విషయమున ఓర్పును, ప్రోత్సాహమును, పట్టుదలయు హెచ్చినచో ఈ రాష్ట్రమందు ఖద్దరు ఎట్లు వృద్ధి చెందగలదో దీనివలన సూచితమగుచున్నది. శ్రీమతి సరోజినీదేవి హైద్రాబాదులో నున్న ఖాదీ వస్త్రాలయమును సందర్శించినప్పుడు కరీంనగరములో తయారగు ఖద్దరును గూర్చి గావించిన ప్రశంసయు ఈ రాష్ట్రమందు ఖద్దరు వ్యాప్తికి ఆశను కల్పించుచున్నది. “కరీంనగర్ జిల్లాలో తయారు చేయబడిన ఖద్దరు భారతదేశమందు తక్కిన భాగములలో చేయబడు అటువంటి రకములతో సరిగా తులతూగుచున్నదని" దేవిగారు చెప్పిరి.
మ. ఘ. వ. నిజాం ప్రభువుగారి రాష్ట్రమందు ఖద్దరు వ్యా ప్తికి అనుకూలించు ముఖ్య విషయము మరియొకటి గలదు. ఇచ్చట ఇద్దరు సరకు ధరను తగ్గించిన కారణములలో ప్రత్తి ధర తగ్గుటతోపాటు వడకు వారి యొక్కయు నేయువారి యొక్కయు పనితనపు నేర్పు వృద్దియగుటయు, వారిపరస్పరానుకూల్యభావమున్ను చేరియున్నవి ఇవి శాశ్వతముగ నుండగల విషయములు, నిజాం సంస్థానము గర్వించదగిన విషయములు ఈ కారణములు పై జెప్పబడిన యితర కారణములతో కలిసి స్థానిక ఖాదీవస్త్రాలయము వారిని వివిధ సంస్థలలో ఏజంట్ల నేర్పరచి ఖద్దరు వాడుకను ఎక్కువజేయ ప్రోత్సహించినవి. ఇప్పుడు ఔరంగాబాదు, నాందేడు, జాల్నా. అంబాజోగల్, హిపర్గో, నిజామాబాదు - ఈ చోట్లలో ఏజన్సీలు గలవు
ఒక్క ఖాదీ వస్త్రాలయము యొక్క ప్రయత్నమువలన ఈ రాష్ట్రమందు ఖద్దరు వ్యాప్తి యింతవృద్ధియై నప్పుడు, ప్రభుత్వమువారి ప్రోత్సాహమున్నచో ఇంకెంత వృద్ధిగావచ్చునో సుళువుగా ఊహింపగలము కాబట్టి యే నివేదికలోమ. ఘ.వ నిజాం ప్రభుత్వమువారి ప్రోత్సాహము ఖాదీ వస్త్రాలయమువారిచే అపేక్షింపబడినది. ఇప్పుడు మన ప్రభుత్వమువారు అక్ట్రాయిపన్నును దీసివేసి