Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిజాం రాష్ట్రమందు ఖద్దరు

17 - 6 -1933

ఈ సంచికయందే మఱి యొక చోట పొందుపరపబడిన హైదరాబాదు ఖాదీ వస్త్రాలయము యొక్క రెండవ సంవత్సరపు నివేదిక మ. ఘ. వ నిజాం రాష్ట్రమందు ఖద్దరు వృద్ధిచేయుటకుగల ఆశను, అవకాశమును సూచించుచున్నది ఈ ఖాదీ వస్త్రాలయము 'అఖిల భారత తంతు కారక సంఘము' (ఆల్ ఇండియా స్పిన్నర్స్ అసోసియేషన్) యొక్క శాఖగా 1931 జూన్ 14వ తేది స్థాపింపబడెను 1932 జూను 14వ తేదీ మొదలుకొని 1933 జూన్ 14 తేదితో అంతమగు సంవత్సరములో ఈ సంస్థ చిల్లరగానేమి, ఏజంట్లకేమి అమ్మగల్గిన ఖద్దరు మొత్తము విలువ రూ.34043-5-11లు. 1931 జూన్ 14 వ తేదీతో అంతమగు సంవత్సరములో ఈ సంస్థ రూ.15166-7-7 లు విలువగల ఖద్దరును అమ్మ గల్గెను. అనగా మొదటి సంవత్సరములో కన్న రెండవ సంవత్సరములో సదరు సంస్థ అమ్మగల్గిన ఖద్దరు రెండింతలకుపైబడియేయున్నది. మొదటి సంవత్సరములో వస్త్రాలయము రూ 29000 ల సరకును కొనియుండెను. రెండవ సంవత్సరములో రూ 50000 ల సరకు కొనబడెను ఈ విధముగా ఈ రాష్ట్రమందు ఖద్దరును ప్రేమించువారి యందు వృద్ధి కనబడుచున్నది.

దీనికి అనేక కారణములు గలవు భారతదేశమంతటను క్రొత్తగా వ్యాపించియున్న స్వదేశీయ వస్త్వభిమానము కొంతమట్టుకు ఒక కారణము. అయితే ఇది ఈ రాష్ట్రమందు అంత ప్రధానమైనదని తలచబనిలేదు. ఇక్కడ ఖద్దరు వ్యాప్తిని పెంచగల్గిన ముఖ్య కారణము సామాన్యులగు గ్రామ జనులు మొదలుకొని నాజూకు కోరు పెద్ద నాగరకులవరకు ఎన్నెన్ని రుచులుగలవో వాటికన్నిటికీని సరిపోవు ఖద్దరు సరకును వస్త్రాలయము ఆమ్మగల్గుటయే అని నివేదికలో తెలుపబడినది ఈ సందర్భములో నిజాం రాష్ట్రీయులు గర్వింపదగిన విషయమేమనగా, వస్త్రాలయమువారు అమ్మగలిన పలు రకముల ఖదరు