సురవరం ప్రతాపరెడ్డి
151
మహాత్ము డుపవసింపవలసి వచ్చెను. ప్రస్తుతమన్ననో అట్టివి విశేషోద్దేశ్యమేదిగాని లేదు. 21 రోజులను క్రమముగా ఉపవాసము జరిగియే తీరవలెను.
మరి యీ యుపవాస మెందుకు? హరిజనుల యభివృద్ధిని దలచియేయని మహాత్ముడు వాక్రుచ్చినాడు. హరిజనుల యభివృద్ధికి ఈ ఉపవాసమెట్లు దోడ్పడును? తక్కిన కారణ విశేషములను మహాత్ముడు గోప్యములైనంత పవిత్రములని తెలియజేయలేదు అయినను సూక్ష్మముగా హరిజనోద్ధరణమునకై ఉద్యమించుచున్న తన యొక్కయు తన తోటివారి యొక్కయు ఆత్మ సంశుద్ధికియని మహాత్ముడు తెలుపుచున్నాడు
దీని యర్ధమేమి? ఇప్పటికే ఈ పవిత్రోద్యమమును కొన్ని కళంకములు ఆవహించియున్నవని మహాత్మునికి గోచరించి యుండవలెను. కాబట్టి మహాత్ముని ఉపవాస సమయమున హరిజనోద్యమములో పనిచేయువారేమి చేయదగినదియు దీనినిబట్టి గ్రహింపవచ్చును. వారు బాహ్యాంతశ్శుద్ధిని రక్షించుకొనుటయందు బహు జాగరూకులుగా నుండవలసి యున్నది. హరిజనోద్ధరణోద్యమము పవిత్ర కార్యము. పవిత్రకార్యములన్నింటియందు చూపదగిన శుద్ధినే యిందును అవలంబింపవలెను. కాబట్టి ఇంతవరకును హరిజనోద్ధరణోద్యమమందు చేరియున్నవారు మహాత్ముని యుపవాసకాలమున తమ యంతరాత్మలవైపు దృష్టిని మరల్చి తమ లోపములను పరిశోధించి పశ్చాత్తాపశుద్ధ మనస్కులయ్యెదరు గాక, అంతేచాలదు. భవిష్యత్తులో అటు వంటి దోషములు లేకుండ తమ ప్రవర్తనమును రక్షించుకొనుటకు నిశ్చయించుకొనెదరుగాక
ఏ వి థక్కరుగారు హరిజనోద్ధరణోద్యమమునందు కొన్ని ప్రాంతముల జడత్వ దోషమును సూచించుచున్నారు. వారు తమ మాంద్యమును వదల వలసి యున్నది. భారతదేశమందనేక భాగములలో హరిజనోద్ధరణ సంఘములే యేర్పడ లేదట. ఇది యిటుండ కొందరు సనాతనులు హరిజనులను దేవాలయ ప్రవేశార్హత గలవారినిగ జేయు చిత్తుశాసనములను ప్రారంభము నుండియు ఎదిరించు చున్నారు. ఇదంతయు మహాత్ముని మనస్సును కలవరపెట్టి యుండునని తలచెదము మొదట మహాత్ముని యుపవాసమును మాన్పుటకై సవర్ణ హిందూనాయకులు ఆస్పృశ్యతను నిర్మూలించుటకై వాగ్దాన మిచ్చునపుడు ఏ అభ్యంతరమును తెలుపక మహాత్ముడు ఉపవాసమును విరమించువరకు తూష్టింభావము వహించిన