21 రోజుల ఉపవాస దీక్ష
10 - 5 - 33
గాంధిమహాత్ముడు మే 8 వ తేది సోమవారంనాడు మధ్యాహ్నము 12 గంటలైన తరువాత బంధు మిత్రుల మధ్య భగవన్నామ కీర్తనముతో 21 రోజుల ఉపవాస దీక్షను ప్రారంభించినాడు. మహాత్ముడు ఉపవాసమును నిశ్చయించుకొనిస సందేశము తెలిసిన వెంటనే భారతదేశము యొక్క అన్ని భాగములును గజ గజ వణకసాగెను. అన్ని మూలల నుండియు మహాత్ముని భక్తులును, మిత్రులును మహాత్ముని ప్రాణవిషయమున సంశయ భీతిగ్రస్తులై ఉపవాసమును మానుడని ప్రాధేయ పడజొచ్చిరి. కొందరు ఎరవాడకేగి కన్నీళ్ళతో మహాత్ముని హృదయమును కరిగింపజూచిరి. కాని ఆ హృదయము మొదట కఠినమైయుండినకదా కన్నీటికి కరుగుననుమాట, మహాత్ముడు తన నిశ్చయమును మానుటకు వీలులేదని చెప్పిన తన ప్రాణ విషయమున ఎవరును భీతిజెంద నవసరములేదని నచ్చజెప్పెను
ఇచటనే మహత్ముని పూర్వోపవాసమునకును ప్రస్తుతోపవాసమునకును గల భేదము ఒకటిగోచరించు చున్నది. ఇదివరకు సెప్టెంబరులో మహాత్ము డుపవసించునప్పుడు తాను జీవింప గల్గునో లేదో అను విషయము వారికే తెలిసి యుండలేదు. ఇప్పుడన్ననో అట్లుగాక తాను అన్ని రోజులు కూడ ఉపవాసముండి జీవింపగల్గుదునని గట్టి విశ్వాసముతో నున్నాడు. అందరికిని అదేధైర్యము చెప్పుచున్నాడు. కాని సామాన్య జనులకు ఆ ధైర్యనుబ్బునా? వారు ప్రేమించు వస్తువు యొక్క వినియోగమును తలచి భయపడుటయు దుఃఖించుటయు సామాన్య మానపునికి ప్రకృతి మహాత్ముడో ప్రకృతిని నియమించువాడు.
మరియొక భేదమేమనగా పూర్వోపవాసమందు మెక్డానాల్డుగారి సాంఘిక సమస్యా పరిష్కారమువల్ల శాశ్వతమై యుండవలసిన సవర్ణాస్పృశ్య విభాగమును లేకుండ చేయుటకై సదరు పరిష్కారమునే తీసివేయించు నుద్దేశ్యముతో