Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

149

ప్రేమతో భావిభారతీయాభివృద్ధికి యత్నించెదరుగాక ఉదకమండలములలో సర్ మీర్జా ఇస్మేయిల్ మహాశయుడు శంకుస్థాపన చేసిన గణేశ దేవాలయము నుండి "మనము ఈ మతములో ఈ పరిస్థితులలో పుట్టవలెనని మొదట కోరియుండలేదు. మనము పుట్టినపుడు మనకు ఏర్పడిన ప్రకృతిసిద్ధ గుణములు మనము కోరినవికావు. మంచిగాని, చెడుగాని అవి తర్వాత ఎప్పుడో మనపై వేయబడినవి అందువల్ల వేర్వేరు మతముల నవలంబించిన వార్త యైనను మనము ఒకరి నొకరు సోదరునివలె జూచుట ముఖ్యము కాదా!" అను హిందూ ముసల్మాను ప్రేమసందేశము నాల్గు దిక్కులకు పోయి నిర్విఘ్నముగా జయించు గాత!