Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

సర్ మీర్జా ఇస్మేయిల్‌గారు మహమ్మదీయులేయైనను హిందూమతమును గూర్చి వారు గావించు సంస్తవమును చూడుడు. విద్యాసంస్కృతబుద్ధులై సత్యమును గౌరవించుటకు తగినంత సహనభావముగల ఎవరుగాని మీర్జాగారి అభిప్రాయమును ఎదిరింపరు హిందూమతము పరమతస్థులను తన వంకకు త్రిప్పుకొనుటకై వారిని బలాత్కరించునదికాదు. హిందూమతమును విశ్వసించువారు పరమతములను దూషింపక గౌరవింపగల్గుటయే హిందూమతము యొక్క విశేషము తన మతమును నమ్మి పరమతస్థులను సహింపవలసినదని బోధించు మతమేదైనయున్నచో అది గౌరవమునకు అనర్హమైనది అది మతమని అనిపించుకొనుటకే తగదని మైసూరు దివానుగారి నమ్మకము. వాస్తవమీరీతిగనుండ దేవాలయముల పేరు పెట్టియు, మసీదుల పేరు పరస్పర రక్తపాతములకు కర్తలగు హిందువులుగాని, మహమ్మదీయులుగాని చదివినవారైనను చదువువలని ఫలమును పొందనివారే యని చెప్పవలసియున్నది మహమ్మదీయుల మసీదుల ఎదుట హిందువులు వాద్యములు మ్రోయింపకూడదు. అను విధిని వారి మతము చేయుచున్నదని మేము తలపజాలము. అది ఎటులున్నను హిందూమతము దేవాలయములవద్ద మహమ్మదీయులు తమ వాద్యములను మ్రోయింపరాదని విధించుటలేదు. ఒక మసీదు ఎదుటగాని, దేవాలయము ఎదుటగాని వాద్యములు వాయించుటను గూర్చిన విషయములలో ప్రభుత్వము వారి చర్యలకు న్యాయశాస్త్రము ఆధారముగ నుండవలెను. ప్రజలు ఎవరుగాని ఉపయోగించుటకు హక్కుగల వీథిలో వారు సాధారణముగ ఉత్సవములను జరుపుకొనుటకు అభ్యంతరము కలిగింపబడరాదు. అట్టి యభ్యంతరము కలిగించువారినుండి ప్రభుత్వమువారు శాంతిని కాపాడవలసియున్నది అట్లుగాక బలవంతులమని చెప్పి ప్రజల హక్కులకు భంగము కలిగించినవారిచే అనుకూలముగ ప్రవర్తించుట వలన ఆ ప్రభుత్వము యొక్క శక్తియందు ప్రజల విశ్వాసము నశించును

అట్లనుటచే ఉపద్రవమును సూచించుట మా తలపు గాదు. సర్ మీర్జా ఇస్మేయిల్‌గారి నిష్పక్షపాతబుద్ధి ప్రతి ప్రభుత్వమును ఆవేశింపవలెను. మహమ్మదీయుల మసీదుల దగ్గరకు బోయి తమ వాద్యములందలి నేర్పును జూపవలెనని హిందువులకు అభిప్రాయమే లేదు. కాబట్టి గతమును గతమునుగ తలచి హిందూ ముసల్మానులు ఒకరొకరి మతముల యందలి గుణముల గ్రహించి పరస్పర