146
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
మన రాష్ట్రీయాంధ్రులకు ఆంధ్రము రోత ఆంధ్ర పత్రికలు చెత్త, ఆంధ్రులందరు చెంచులుగా తోచుచున్నట్లున్నది. నిన్ననే రెడ్డి విద్యాలయములో ఆసేత శీతనగర పర్యంతముగా ప్రఖ్యాత పాండిత్యముచే వికాశించుచున్న హిందూ విద్యాపీఠ మహాధ్యక్షులైన "ధృవ” గారిట్లు సెలనిచ్చిరి. "మాతృభాష యందభిమానముండవలెను. మాతృభాషలో నాలోచింపవలెను - మాతృభాషలో చదువవలెను. అట్లు చేసిననే గాని జాతి వృద్ధి పొందజాలదు."
ఇటీవల గాంధీ మహాత్ములు సహితము “ఆంధ్ర భాషను నేను నేర్వ గోరుచున్నాను గాని యీ ప్రభుత్వమెప్పుడు జూచినను నన్ను జైలులో నిర్బంధించుచున్నది. ఏమి చేయుదును" అని సెలవిచ్చిరి. కావున నెవ్వరిని బోయి విచారించినను తుదకు రహెబరు దక్కనులో గూడ విచారించి చూచినను మంది భాషల "అఖ్సిజమీను"లో వేయండి గాని మా భాష విషయములో నోరెత్తివా ఖబడ్దార్ అందురు గాని యదేమి గ్రహచారమో యదేమి కాలవైపరీత్యమో, యదేమి కర్మ పరిపాకమో యెవరికి తెలివివచ్చినను మన నిజాము రాష్ట్రాంధ్ర సోదరులలో నెన్నడు భాషాభిమానము నెన్నడు ఐక్యమత్యము, ఎన్నడు సర్వతోముఖాభివృద్ధి కలుగవలెనో యా దయ్యమునకే యెరుక.