Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

పరిశోధన సల్పుటచే యిట్టి గ్రంథముల నన్నింటిని ఉద్ధరించి ఆంధ్ర శారదకు సేవజేసిన వారగుదురు మానవుని జీవితమందు ఆత్మోన్నతికిని, ఆనందమునకును సారస్వతమొక సాధనము ఆంధ్ర సారస్వత సేవ చేయుటచే ఆంధ్రుల యభివృద్ధికి మరియొక మెట్టు గట్టినట్లగును పూర్వకాలమందు పంచలక్షణములై వంశానుచరిత మొక భాగముగా గల పురాణములు బయలుదేరినది మానవుని నైతికాధ్యాత్మికాద్యభివృద్ధికే గదా ఇప్పటికిని మన భారతదేశమందు పురాణ చరిత్రము అభివృద్ధికి తోడ్పడుచునే యున్నవి

సారస్వతము అభివృద్ధికి మార్గమగుట గాకయే అభివృద్ధికి సూచనము సైతమగును కాబట్టి బ్రిటిషు యిండియాలోని ఆంధ్రులు ఆంధ్రసారస్వతమును పోషించుటకై విరివిగా కృషిచేయుచున్నారు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారు ఆంధ్రుల పాఠశాలలో ఆంధ్రమును నిర్బంధ పఠనీయముగ జేసి ఆంధ్రాభివృద్ధికి సాయము చేయుచున్నారు మన రాష్ట్రమందు మహాఘనత వహించిన నిజాము దొరతనమువారు శాసన పరిశోధనము గావించుటకును పూర్వ వస్తువుల గాపాడుటకును యేర్పాట్లు గావించి ఆంధ్ర పరిశోధకులకు మంచి యుత్సాహము కలిగించుచున్నను, ఆంధ్రుల విద్య ఆంధ్రభాష ద్వారాగా నేర్పబడుటకు ఆనుకూల వసతుల గల్పించుటలో ప్రభుత్వము వారు తగినంత శ్రద్ధ జూపెడు పక్షమున ఆంధ్రుల యభివృద్ధికి గల యొక గొప్ప ఆటంకము తొలగినదగును నిజాం రాష్ట్రములో సర్కారు పాఠశాలలో చదువు ఆంధ్ర విద్యార్థులందరు ఆంధ్రమును తన రెండవ భాషగా గ్రహించి అభ్యసించుట మంచిది.

ప్రస్తుత పరిశోధక మహామండలి వారు తమ యవ్యాజకృషిచే ఆంధ్రభాష యొక్కయు ఆంధ్రజాతి యొక్కయు వ్యక్తిత్వపు ఔనత్యమును ప్రకాశింప జేసిన వీరాంధ్ర యువకుల హృదయములలో ఆత్మ గౌరవము నెలకొనుటకు సాయపడగలరని యాశించెదము ప్రస్తుతము మండలి కొద్ది మంది యొక్క అభిమానోత్సాహములచే స్థాపించబడినదైనను మండలియొక్క కార్యములనేకములు సరిగా నిర్వహింపబడవలెనన్న ధన సహాయ మవసరము. నిజాం రాష్ట్రాంధ్ర సేవ నొనర్చుట బూనుకొని ఆంధ్రులు అభిమానము చూపరాయను ధైర్యముతో మండలి స్థాపకులు కార్యరంగమున దిగుచున్నారు. వీరి ధైర్యమునకు రాష్ట్రాభిమాను లెల్లరును తమ శక్తికొలది తోడ్పడుటకు వెనుదీయరని నమ్ముచున్నాము.