Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

మైన సందర్భములలో పోలిక తెలిసికొనుటకై ఇతర రాష్ట్రముల నివేదికలు మున్నగునవి తెప్పించి యుండవచ్చును. రాజకీయ విషయముల విజ్ఞానమునకుగల ప్రాముఖ్యతనుబట్టి, ఇట్టి గ్రంథ సంగ్రహము చాల అవసరమైనది కీ శే కేశవరావుగారిట్టి గ్రంధ సముదాయము అవసరమని తలంచి యుండిరి. కాని వారి జీవిత కాలమునందు ఈ పని జరిగి యుండలేదు ఇట్టి పని ఇప్పుడు సమర్థులగు దేశాభిమానులును ప్రారంభించిన యెడల మన భవిష్యత్సంతానములకు చాల లాభకారియగును. ఈ విషయము దేశీయులు ఆలోచించి కార్య రూపమునకు తెత్తురని విశ్వసింపుచున్నాము.