Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

139

చట్టముల చిత్తులు ప్రవేశ పెట్టవచ్చునో కూడదో, ప్రభుత్వమునందు ఏయే శాఖలు కలవో, దేని కర్తవ్యము లెట్టివో ఇట్టి సూక్ష్మ విషయములు తెలిసి కొనినదే రాజకీయ విషయములలో వాద వివాదము సల్పబూనుట అపాయహేతువగును ఈ విషయమును దృష్టి యందుంచియే కాబోలును మన ప్రభుత్వమువారు ప్రతి సందర్భములోను రాజకీయ విషయములలో జోక్యము పుచ్చుకొనవలదని హెచ్చరించుచు రాజకీయ విషయికమైనట్టిదిగాని, రాజకీయములగు ఫలితములు కలిగించు నట్టి గాని సభలను సమావేశపరుప అనుజ్ఞ నీయకున్నారు. ఇటీవల ఆంధ్ర జన కేంద్ర సంఘ కార్యదర్శి పేర వ్రాసినట్టి లేఖలో ప్రభుత్యమువారి విషయమునే ప్రకటించియున్నారు.

మా యభిప్రాయన ప్రభుత్వము వారి లేఖ యొక ముఖ్య తత్వమును ప్రతిపాదించుచున్నది. అదేదన రాజకీయ విషయిక జ్ఞానము బాగుగా సంపాదింపకయే రాజకీయ సభలు జరుపవలదను నదియే యా తత్వము. కనుక దేశీయులు రాజకీయములను పఠించవలయును. ప్రభువుగారి యాజ్ఞలను, మంత్రిమండల నిర్మాణ విధానమును, కార్య పరంపరను, పరిపాలనా నివేదికలను, అప్పుడప్పుడు ప్రభుత్వము వారు ప్రకటించుచుండు ప్రత్యేక గ్రంథములను, విద్యా విధానమును, ప్రజారోగ్య సమస్యలను, ఎగుమతి దిగుమతులను గూర్చి నట్టియు అంకెలను, భూమ్యాదాయ విషయములను బాగుగా దెలిసికొనవలయును మన శాసన నిర్మాణ సభయొక్క అధికారములను, సభ్యుల నెన్నుకొను పద్ధతియును, కార్యక్రమ విధానమును సవివరముగా నెరుంగవలయును గొప్ప విద్యాధికులు కూడ ఇట్టి యంశముల దెలిసికొనకపోవుట చాలా విచారకరము ఇట్టి జ్ఞానము సంపాదించినచో మనము రాజకీయ విషయములను చర్చించ నర్హుల మగుదుమా? ముమ్మాటికి కాము!

ఇట్టి పరిజ్ఞానము లభించవలయు నన్న, ప్రస్తుతము రాజధాని నగరమున నిట్టి గ్రంధ సంగ్రహము గల భాండాగారము కావలెను నిదివరకు ఉన్న గ్రంథాలయములలో దాదాపుగా అన్నియు ఇతర విధమైన పుస్తకములే కాని పై విషయముల గ్రహించుట కుపయోగించునవి లేవు. ఈ భాండాగారము నందు మన రాష్ట్రపు రాజకీయ గ్రంథములకు ముఖ్య స్థానముండవలయును. అవసర