రాజకీయములు నిజాం రాష్ట్ర ప్రజలు
9-11-1932
మన రాష్ట్రములోని ప్రజలందు విద్య చాలా తక్కువగా నున్న సంగతి అందరకును విదితమే. అందును విద్యాధికులనబడు వారిలో కూడ ఇతర విషయక విజ్ఞానము ఎంతయో యున్నను రాజకీయవిషయములను గూర్చిన జ్ఞానము చాల లోపించి యున్నది ఇందునకు అనేక కారణములు చూపవచ్చును అయినను, ముఖ్య కారణము మా దృష్టి కొకటి కానవచ్చుచున్నది అది యేమి? రాజకీయ విషయములను కష్టించి బాగుగా దెలుసుకొందమను ఉత్సాహమును, దానికొరకు శ్రమ చేయు పట్టుదల లేకపోవుటయే యని చెప్పవచ్చును. బ్రిటిషు ఇండియాలో విశేషముగా రాజకీయ విషయక జ్ఞానమున్నది కదా అది పత్రికల ముఖమునను, గ్రంథముల రూపమునను వచ్చుచున్నది కదా అట్లుండియు మన రాష్ట్ర వాసులకు రాజకీయ విషయములు జ్ఞానము అలవడుటకు కారణమేమని ఎవరైన ప్రశ్నించవచ్చును కాని యథార్థమేమనగా, బ్రిటిషు ఇండియా రాజకీయములకును, మన రాజకీయములకును హస్తిమ శకాంతరమున్నది అచ్చటి ప్రతి రాజకీయ తత్వమునకు ఉపయోగించజాలదు.
మన రాష్ట్రపు రాజకీయముల స్థితి మొదటి నుండియు వేరు విధమైనది. కనుక దీని క్రమ వికాసము చాలవరకు భిన్నము కనుక మొదటి మన రాష్ట్రము యొక్క పాలన నిర్మాణము ఎట్టిదో, దానిని బట్టి పాలించు మంత్రి మండలము యొక్క అధికారము లెట్టివో పాలనా విధానమున మంత్రి మండలము, అధికారమునకు మించి మ॥ఘ॥వ॥ ప్రభువుగారి అంగీకారము పొందవలసిన విషయము లేవియో' శాసన నిర్మాణ సభకు ఎంతవర కధికారములు కలవో, శాసన నిర్మాణ సభలో ప్రవేశపెట్టకయే ఏయే విషయములలో ప్రభుత్వము వారు నియమము లేర్పాటు చేయుటకు వీలు కలదో, మహా ఘనత వహించిన శ్రీ ప్రభువుగారు స్వయముగ ఫర్మాను ద్వారా ఆజ్ఞ ఇచ్చిన మీదట శాసన నిర్మాణ సభలో