హైదరాబాదు స్త్రీల యుత్సాహము
1-10-1932
హైదరాబాదునందు, తక్కిన భారత రాష్ట్రములయందువలె ప్రజల సేవకై స్త్రీలు ఉత్సహించుచుండుట యెంతయు హర్ష సంజనకముగానున్నది. గత బుధవార పత్రికయందు, సెప్టెంబరు నెల 24 వ తేదినాడు సమా వేశమున హైదరాబాదు మహిళా మహాసభ యొక్క కార్యక్రమము వర్ణితమై యున్నది. ఈ మహాసభ అఖిల భారత మహిళా మహాసభతో సంబంధము గలదై దానికి ఇరువది మంది ప్రతినిధులను ఎన్నుకొని పంపుచుండుట ప్రశంసింపదగిన విషయము గాంధి మహాత్ముడు గుర్తించినటుల యిది స్త్రీల యుగము స్త్రీలు సంకుచిత దృష్టి వదలి సోదరీ వర్గముతో కలసి లోకకళ్యాణమునకై పాటుపడినచో ప్రపంచమునకంతయు త్వరలో శాంతి చేకూర కలదు శాంతము లేక సౌఖ్యము లేదు. ఇందు వారి సహజ కోమల హృదయ మెంతయో యుపకరించును. ఈ విషయము ప్రస్తుత మహాసభ యొక్క ఉపన్యాస నిర్ణయములయందు స్పష్టమగుచున్నది.
శ్రీమతి శ్రీకిస్‌గారి సతీమణి యధ్యక్ష స్థానమలంకరించి యుపన్యసించుచు, ధనవంతులు అజ్ఞానులగు దాసీలకు తమ బిడ్డలను సంరక్షణార్థమై ఒప్పగించుట వలన జ్ఞానశూన్యుల దురాచారములు పసితనమందే పట్టుబడుట సంభవించుచున్నదనియు, కాబట్టి శిశువులను పెంచు పని జ్ఞానవంతులై జాగరూకులగు వారి యధీనమందుండవలెననియు చెప్పెను ఈ మాటను తల్లిదండ్రులు అనుసరించినచో సంఘమునందు ఆరోగ్యము, ఐశ్వర్యము, శాంతియు తప్పక వర్ధిల్ల గలవు ఈ మూడును ఆచారశీలములపై నాధారపడియున్నవి. ఆచార శీల బీజము పసితనమందు నాటి మెలకువతో కాపాడినగాని చక్కగా ఫలింపదు.
ప్రస్తుత మహాసభ గావించిన నిర్బంధ ప్రారంభ విద్య తీర్మానము కార్య రూపమున పరిణమించుట అధిక భాగము విద్యాగంధ హీనమైన మన