రెడ్డి విద్యార్థి గృహము
20-8-1932
గత వారములో రెండు దినములు రెడ్డిహాస్టలు యొక్క వార్షికోత్సవము జరుపబడినది వ॥లుత్ఫొద్దౌలాగారి యుపన్యాసమును, రెడ్డిహాస్టలు నివేదికను వేరుచో ప్రకటించియున్నాము. రెడ్డి హాస్టలు 1327 ఫసలీలో స్థాపింపబడెను. ఈ కొలది కాలములో హాస్టలు భవనములు, గ్రంథములు మున్నగునవి సుమారు రెండు లక్షల విలువగలవగుటయు గ్రంథాలయములో 9000 గ్రంథములుండుటయు, విద్యార్థులు 163 గ్గురు ఉండుటయు చూడ దీని యభివృద్ధిని గూర్చి ఆంధ్రు లందరును సంతోషింపవలసి యున్నది. ఇట్టి సంస్థ హైదరాబాదు రాష్ట్రములో మరొక్కటి లేదనవచ్చును రెడ్డి హాస్టలు అధికారవర్గ మీ విషయమై ప్రశంసాపాత్రులుగా నున్నారు నవాబు లుత్ఫోద్దౌలాగారు సెలవిచ్చి నటుల రాజబహద్దరు వేంకటరామారెడ్డి ఓ బి. ఇ గారు ముఖ్యముగా ప్రశంసాపాత్రులు. ఈ వసతి గృహ పక్షమున వ్యయసాయమున కనువగు భూమి సంపాదించుటయు, నందు హాస్టలున కవసరమగు కూరగాయలు పండించుటయు, విద్యార్థులే యెక్కువగా దీనిలో శ్రద్ధ వహించుటయు చూడ నీ వసతి గృహము యొక్క భావిధశయింకను ప్రశంసా పాత్రముగా సుండగలదని నమ్ముచున్నాము
ఈ వసతి గృహమునకు ఈ 14 సంవత్సరముల నుండి ప్రభుత్వ సహాయము లేదని వినుట మాకాశ్చర్యము కలిగించు చున్నది అన్ని సంస్థల కన్న నీ సంస్థ ప్రభుత్వ సహాయము పొందుటలో నగ్రస్థానము వహింపగలిగినది ఏలన నవాబులుత్ఫోద్దౌలాగారు సెలవిచ్చినటుల రెడ్లు నిజమైన ముల్కీలు ఇతరులవలె వీరు ఇతర ప్రసంగములలో జిక్కుకొనువారుకారు వీరికి భూమి తప్ప వేరే యాధారము లేదు. కావున వీరు ప్రాచీనము నుండియు నీరాష్ట్రమందే నివసించి ఈ రాష్ట్రములో సుఖ దుఃఖముల ననుభవించిన వారు. వీరిలో ---- జాగీరులు, మక్తాలు సంస్థానములు కలవారు కలరు. అనగా వీరి పూర్వులు