Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన రాష్ట్ర పరిశ్రమలు

25 - 6 - 1932

బహు కాలమునుండి మన రాష్ట్రాభివృద్ధిని, తద్వారా ప్రజల యభివృద్ధిని గోరునట్టి పూజ్యులైన మ॥ఘ॥వ॥ మన ప్రభువుగారు మన రాష్ట్రములో పరిశ్రమ శాఖను నేర్పాటుచేసియున్నారు ఇదెంతయు సంతోషింపదగిన యంశము ఇంతియ గాక శ్రీ ప్రభువుగారు మూడు సంవత్సరముల క్రిందట పరిశ్రమాభివృద్ధి కని 1 కోటి రూప్యములను ప్రత్యేకించుట కాజ్ఞాపించిరి. ఈ యొక్క యంశమే మన యజమానులకు తమ ప్రియమైన ప్రజలందుగల ప్రేమను జాటుటకు తగియున్నది. ఆర్థికశాఖా మంత్రులగు సర్ హైదరు నవాజుజంగు నవాబుగారును తమ యపూర్వ శక్తి సామర్ధ్యములను ప్రకటించి పరిశ్రమల కింత గొప్ప మొత్తమును సంపాదించియుంచిరి కాలిన్సుగారును ఈ పరిశ్రమ శాఖాధ్యక్షులై తమ యావచ్ఛక్తిని వినియోగించి, యీ రాష్ట్రమందు దినదినము పరిశ్రమలే కాక వ్యాపారమును, సహకార సంఘములును, వ్యవసాయమును సత్వరాభివృద్ధి పొందుటకై చాల పాటుపడుచున్నారు.

మన రాష్ట్రములో ప్రాచీనమునుండి కొన్ని పరిశ్రమలు చాల యభివృద్ధిలో నున్నవి కేవలము నిజాము రాష్ట్రమందేకాక బ్రిటిషిండియాకును మన సరకులు దిగుమతి యగుచున్నవి. బీదరు, పెంబర్తి, ఔరంగాబాదు, ఒరంగల్, ఆలంపూరు, వంటి స్థలములు, లోహపు పనులకును, నేత పరిశ్రమలకును చాల ప్రసిద్ధి చెందినట్టివి. ఇప్పుడిప్పుడు గాజు పనులును, సబ్బు పనులును, మిల్లు బట్టలును, సిగరేట్లును, మన రాష్ట్రములో తయారగుచున్నవి. సిగరేట్లు కొరకై కొక క్రొత్త పొగాకు నిపుణుని పిలిపించియున్నారు. వ్యవసాయులకై జాతరలందేకాక ప్రతి సంవత్సరము రెండుమారులు జిల్లాలలో వ్యవసాయ ప్రదర్శనములు చేయుచున్నారు