సురవరం ప్రతాపరెడ్డి
125
నివేదిక యొకటి యా యభిప్రాయార్థమై మాకు ప్రకటనశాఖ ద్వారా పంపబడినది
ఈ నివేదికలో హిందూస్థానములో ప్రతి సంవత్సరము 1 లక్ష టన్నుల తూకముగల కాగితము బయటినుండి దిగుమితి యగుచున్నదనియు నిప్పుడుండు హిందూస్థానపు యంత్రాలయములలో 45 వేల టన్నుల కాగితమే తయారగుచున్నదనియు, తెలిపినారు. మన రాష్ట్రములో ప్రతి సంవత్సరము 1600 టన్నుల కాగితము దిగుమతి యగుచున్నదని 1335-1340 ఫసలీల లెక్కల నుండి చూపించినారు.
ఈ కారణములచేత మన రాష్ట్రములో కాగితపరిశ్రమ యవసరమని తోచినది. దీనికి తగిన స్థలము తగిన ధనము తగిన యితర సౌకర్యములన్నియు గావలసి యున్నది కాగితము సిద్ధము జేయుటకు బొంగులు (వెదురు లేక గోవా కట్టెయని కొందరందురు) ఆదిలాబాదు జిల్లాలో విశేషముగా కలదు. ఈ జిల్లాలో నేలబొగ్గుగనుల సామీప్యమునుబట్టి బొంగుల సమృద్ధినిబట్టి నీటి వసతినిబట్టి, కూలీల యవసరమునుబట్టి మంచెరియాలయును సిరిపురమును చాలా తగిన స్థలములనియు నీరెంటిలో సిరిపురమే పైచేయి యగుననియు నివేదికలో నిర్ణయించినారు.
నివేదికలో సంవత్సరమునకు 5000 టన్నుల కాగిదమును తయారుచేయుట కంచనా వేయబడినను 10 వేల టన్నులవరకును తయారు చేయుటలో నిబ్బంది యుండదని చూపియున్నారు. 5000 టన్నులు సిద్ధమైనను మన రాష్ట్రముయొక్క అవసరములు పోగా బ్రిటిషు హిందూస్థానమునకు 3000 టన్నులకు పైగా ఎగుమతి జేయవచ్చును.
ఈ యంత్రాలయమునకై 50 లక్షల ధనము అవసరమని నివేదికలో చూపియున్నారు. ఇట్లు ఖర్చు పెట్టి స్థాపించిన దానిలో ప్రతి టన్ను కాగితములకై 366 రూపాయలు ఖర్చగునని యంచనా వేసినారు ఇపుడు మార్కెట్‌లో ఒక టన్ను కాగితములు 500 రూపాయలప్రకార మమ్ముదురనియు ఈ లెక్క ప్రకారము ప్రతి టన్ను పై రూ. 134 లాభము దొరుకుననియు యీ ప్రకారము లెక్కించిన