సురవరం ప్రతాపరెడ్డి
123
ములు త్వరగా పట్టుబడుటయు, నవి వదిలించుట దుర్ఘటమగుటయు చారిత్రకానుభవము చెప్పగలదు తుర్కీ వంటి పరదా రాజ్యమే సంపూర్ణముగా నొక్క దినములో పరదాను గాలికి విసరి వైచెను మన రాష్ట్రములో సహితము శ్రీ ప్రభువుగారి యుపన్యాసానుసారము హిందూ ముసల్మానులందఱును త్వరలో పర్దా ఘోష వదులు కొందురు గాక
పరదా వదులుట మంచిదా ఉంచుట మంచిదా యను విషయములో మౌల్విలును, దొరలును, ఉంచుటయే మంచిదని వాదింప వచ్చును. పాశ్చాత్య దేశములో పర్దా లేనందున స్త్రీలు చెడిపోవు చున్నారనియు, ఎక్కడ జూచిన విడాకులే జరుగుచున్నవనియు వ్యభిచారములు జరుగుచున్నవనియు అజ్ఞులు కొందఱు పాశ్చాత్య స్త్రీలపై నిందలు మోపుచున్నారు. కాని వారు యధార్థము తెలియక తమ దురభిప్రాయములను వెల్లడిచేసి కొనుచున్నారు. ఏ జాతిలో వ్యభిచారము హెచ్చుగా నుండునో యా జాతికి గౌరవము గాని ఔన్నత్యముగాని యుండనేరదు ఇంగ్లీషు వారిలో అనేక అనుకరణీయములైన ఉత్తమ గుణముండుట చేతనే వారు మనదేశములో 3 లక్షల మందియే యున్నను 3500 లక్షల జనులమైన మనలను సునాయాసముగా లోబఱచుకొని పరిపాలనము చేయు చున్నారని అట్టి ఇంగ్లీషు వారిని, మరియు నితర పాశ్చాత్యులను మనము బాగుగా నెఱుగక వారి సాంఘిక మర్యాదలు మనకర్ధము కాకను, మన సాంఘిక మర్యాదలకు విరుద్ధముగా కనిబడినంతనే మనకవి సరిపడకుండుట చేతను మనలో ప్రబలిన సంకుచితాభిప్రాయములచే మన సోదరులు అనేకులు వారిని దూషింతురు........