Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన ప్రభుత్వము వారి పాఠము

30 - 3 - 1932

రెండు వారముల క్రితము శ్రీ ప్రభువుగారు లక్నోలోని బాలికా పాఠశాలలో నిచ్చిన యుపన్యాసము వేరుచోట ప్రకటించుచున్నాము. శ్రీవారెంతటి ఘనమైన సంస్కారులో దానివలన విశదమగును. శ్రీవారి యాదర్శము కేవలము ముసల్మానులకే కాక హిందువులకును అనుకరణీయము. మన రాష్ట్రములో ముసల్మానులలో పరదా పద్దతి విశేషము ఈ పరదా ఘోష అనుపదములు ఉర్దూలో నెట్టి యర్థములున్నవో సంస్కృతములో మాత్రము తగిన యర్ధములే కలవైయున్నవి. పరద యనగా నితరులకిచ్చుట, ఘోషయనగా శంఖము పూరించుట ఈ యవస్థలు రెండును పరిహార్యములే

పరదా వలన స్త్రీలకేకాక పురుషులకును చాల ఇబ్బందులు కలుగుచున్నవి మన రాష్ట్రములో పరదా పూర్తిగా ముదరిపోయియున్నది ముసల్మానులను జూచి హిందువులును పరదాలోనికి దిగినారు ముఖ్యముగా మన ఆంధ్రులలోనే యీ ఆచారము ప్రబలిపోయినది మహారాష్ట్రులలో లేదనవచ్చును అంధ్రులలోను అందరిలో లేదు ముఖ్యముగా శ్రీమంతులగు రెడ్లు అనగా దేశముఖులు, జాగీర్దారులు, వెలమదొరలు గోల్కొండ వ్యాపారులు ఈ గోషాపై పట్టుదల చాలా కలవారు

శ్రీ నిజాం ప్రభువంత మహామహులే గోషాను వదిలి యుండ యిక తక్కిన వారికీ యభిమానమేల? యథారాజా తధాప్రజా యనునట్లు ప్రజలును ఈ యుత్తమాదర్శమును గ్రహించి యాచరించుకొందు గాక

ఈ పర్దాపోయిన హిందూ ముసల్మానుల యైకమత్యము కూడ చేకూరు ననిన అనేకుల కాశ్చర్యము కలిగింప వచ్చును. కాని దూరముగా ఆలోచన చేసిన యథార్థమని విజ్ఞులు గ్రహింప గలరు. మనదేశములో దురాచార