సురవరం ప్రతాపరెడ్డి
119
వ్యాఖ్యాన మేమన హిందువులకు కష్టము ముసల్మానులకు సులభము ఇదియే హిందువులు వెనుకబడుటకు ముఖ్య కారణము ఇదెట్లున్నదన ఉరుకుడు పందెములో కొందఱిని అడ్డు లేక చక్కగా ఉరుకుమనుటయు మరికొందఱిని తట్టుకపడు కట్టె అడ్డము పెట్టి ఉరుకుమనుటయు నెట్లో ఆట్లు (Running races Huddle race) సాధారణముగా అధికారులలో నడుమ పందెము (Walking race) ఉండును. అందు ముసలివారిని, పొట్ట పెరిగినవారిని, నడుము విరిగిన వారిని, నడ్డి వచ్చిన వారిని 100 గజముల దూరము ముందుగానే నిలిపి బాగున్న వారిని వెనుకబెట్టి పందెము నడుపుచుందురు ఈ సర్వీసు పందెము కూడ అట్లే కనబడుచున్నది. 'యోదుల్ ఖద్మతు "లకు మన రాష్ట్రములో "ముల్కీ జబాను" పరీక్ష కలదు అట్లే యీ సర్వీసు వారికిని తెనుగు మహారాష్ట్రము, కన్నడములో నేదియైననొక భాష పెట్టి దానికని 100 మార్కులైన పెట్టిన అపుడు సంగతులు తెలియగలవు
మన రాష్ట్రములో పుట్టి తెలంగాణాలో పెరిగి నౌకరీలు చేయు గొప్ప అధికారులు తమ ప్రజల భాష యెరుగని వారు వందల కొలది యున్నారు. అట్లే మరట్వాడాలో. ఇపుడు హిందువులను 400 మార్కులలో 250 మార్కుల ఉర్దూ ప్రశ్నలకు సివిలు సర్వీసులో వ్రాయు మనిన తమ భాష కాకున్నను వారెట్లో ప్రయత్నించుచున్నారు హిందూ విద్యార్థులు ఉర్దూలో నూటికి 40 వచ్చిన పరీక్షలో కృతార్థులగుదురను కొందము ముసల్మాను విద్యార్థుల సౌకర్యార్థమై మరాటీ తెనుగు కన్నడ భాషలలో నేదేని యొకదాని యందు నూటికి 20 మాత్రమే గుణములు వచ్చిన కృతార్థులుగా చేయుటకై మే మొప్పు కొందుము
కావున హిందువులకు సౌకర్యములు తక్కువ దానిపై ప్రోత్సాహము లేకుండుట, అందుపై ఉర్దూలో విశేష భాగము పోటీచేయుట యివియే వారికి ఆటంకములు కలిగించుచున్నవి ఉర్దూ రాజకీయ భాష అనునది మాకు తెలియును. మరియు నితర భాషలు ముల్కీ భాషలనియు మాకు తెలియును ప్రభుత్వము వారికి తల్లిలేని పిల్లలపై యింకను యెక్కవ శ్రద్ధ యుండవలెను, లేకున్న (యతీంఖానా) లుండి యేమి ఫలము ఇప్పుడు “యతీంఖానా”లో చేరిన తెలుగు, మరాటీ, కనడీలకు మంచి గుఱుతుగల గొల్లభామ గడ్డిపాలనైన పోసి పెంచినచో మరి కొంత కాలము జీవింపగలవు