118
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
తనకు సుముఖుడు కాలేడని యొకనికి తెలిసిన వాడు వాని దగ్గఱకే పోడు ఎదుటివాడు తనయందు ప్రీతియున్నదని వాడు గుర్తుపట్టిన వాని దగ్గఱకు తాను పోవుటయే గాక తన బంధువులను గూడ బిలిచికొను పోవును ఏ సంవత్సరమైన హిందువులు హెచ్చుగా తీసుకొనబడిన దాని ఫలితము మఱుచటి సంవత్సరమే విశదమగును, హిందువు లెక్కువ సంఖ్యతో ప్రయత్నింతురు ఇదియే దీని రహస్యము.
ఇక యొక ముఖ్య విషయమును గమనింపవలసియున్నది. హిందువుల నామకరణము హెచ్చుగా నుండినను వారెందుకు పరీక్షలో కృతార్థులు కారు ఒకవేళ యిచ్చటి వారు పరీక్షకులుగా నుండిన పక్షపాతము చూపి యుందురని తలపవచ్చును. కాని యందఱును బయటివారే కదా పరీక్ష చేయునది
ఈ వాదము బాగుగానే యున్నది. కాని మా యభిప్రాయమున బయటివారు కూడ ముసల్మానులే యుండవచ్చునని హిందువులు తలుచుచున్నారు. ఏలయిన విశేషముగా పరీక్షా పత్రములు ఉర్దూ సంబంధము కలవే అందుచేత ఉర్దూ వచ్చిన ముసల్మానులే ఈ పరీక్షకులుగా నుండిన విచిత్రము కాదు. అయినను ఈ విషయములో మాకాక్షేపణము లేదు
మేమాక్షేపించునది పరీక్షా పద్ధతియే! పరీక్షలో మొత్తము 500 గుణములు. అవి యిట్లు విభజింపబడినవి
| ఇంగ్లీషు ప్రశ్నా పత్రిక | 100 |
| ఉర్దూ వ్యాసము | 100 |
| ఇంగ్లీషు నుండి ఉర్దూకు, ఉర్దూ నుండి ఇంగ్లీషుకు తర్జుమా | 100 |
| ఆధునిక సమస్యలు ఇంగ్లీషులో 50, ఉర్దూలో 50 | 100 |
| నోటి జవాబులు | 100 |
| మొత్తం | 500 |
ఈ 500 నూర్లలో నోటి జవాబులు.............. మూలకము కానందుచే అందు భాషా జ్ఞానము..... అభిప్రాయ జ్ఞానమే ప్రధానము కాన అదిపోగా మిగతా 400 గుణములలో ఉర్దూ కొరకై 250 గుణములున్నవి. అనగా ఉర్దూ మాతృ భాష కలవారికెక్కువ సౌకర్యమున్నది. తక్కిన వారికి లేదు దీని