సురవరం ప్రతాపరెడ్డి
117
పరీక్షకులు విశేషముగా రాష్ట్రమునకు బయటనుండువారే యుందురు. అట్టిచో ముసల్మానులయెడ పక్షపాతమెట్లుచేయనగును. ఈయేడు సంవత్సరముల సంఖ్యలను జూచిన హిందువులు తక్కువసంఖ్యలో దరఖాస్తులిచ్చుచున్నారు. అది హిందువులతప్పే అయినను, వారిలో నెక్కు వమందినే నామకరణము చేయుచున్నాము 16-32 లోని సంఖ్యల జూచిన 100 మంది హిందూ దరఖాస్తులలో 60 మంది నామకరణమైనది కాని...... ముసల్మాను దరఖాస్తులలో 298 మాత్రమే నామకరణమైనది పోటీ పరీక్షలోనే హిందువులు క్రిందబడి పోవుచున్నారు”
ఇది ప్రభుత్వము వారి సమాధానము ప్రభుత్వము వారు హిందువుల విషయములో చూపించెడు ప్రేమకు మేము కృతజ్ఞులము మరియు ప్రభుత్వము వారు ప్రజల పక్షమునుండి నేవిధమైన యాక్రోశము కలిగినను వెంటనే దాని విషయమున తమ యభిప్రాయమును వెల్లడించుట చూడ వారి ప్రజానురాగము వెల్లడియగుచున్నది అందుచేత మేము ప్రభుత్వము వారికి రెండు మూడుసూచనలు చేయసాహసించుచున్నాము పైప్రకటనలోని విషయములలోకొన్ని సమాధానములు మాకు సరిగా నచ్చలేదు నామకరణము అనునది వేరు. పరీక్షా ఫలితముగా నియామకమువేరు. నామకరణములో హిందువులనెక్కువగా తీసికొనినంతనే హిందూ విద్యార్ధులకు లాభములేదు హిందువులలో నూటికి 60కి మారుగా 95 తీసికొని ముసల్మానులలో నూటికి 5 మందినే నామకరణము చేసి రనుకొనుడు. పరీక్షా ఫలితముగా ముసల్మానులు 5 లో 4 గురిని తీసికొని హిందువులలో 95 లో నెవ్వరినిగూడ గెలిపించక యుండవచ్చును. కావున పై నామకరణ సంఖ్యలవలన లాభములేదు. మనకు కావలసినది అసలు నియామకములు
హిందువులు నిశ్చయముగా చాలకొలది మందియే దరఖాస్తులిచ్చుచున్నారు. అది హిందువుల తప్పేయనుట కొంత నిజమను కొందాము కాని యంతయు హిందువుల తప్పుకాదు ఈ 15 - 20 ఏండ్లుగా హిందువు లెందఱు ముసల్మాను లెందరు ఎన్నుకొనబడినారు ముసల్మానులే నూటికి 95 ప్రకారము తీసికొనబడి యున్నారు. ఇది చూచియే హిందువులకు దినదినము ధైర్యము తక్కువై లాభములేని యీ విశ్వప్రయత్నములేల యని మానుకొనినారు సాధారణముగా ప్రతి మనుష్యుడు ఎదుటి వాని భావము గుర్తించి పనిచేయును ఎదుటి వాడు