తృతీయాంధ్ర మహాసభ
23-1-1932
ఎన్నడును గష్తీనిషాన్ 53 దెబ్బ యింత బాగా తగిలియుండలేదు. రెండు సంవత్సరములుగా ఆంధ్ర మహాసభలకు అనుజ్ఞ సులభముగా నెల పది పూటలకు ముందే దొఱకుచుండెను కాని యీ తృతీయాంధ్ర మహాసభా గ్రహచారమేమో పాపము ఇంక 13 దినములే మిగిలియున్నను నింతవరకు అనుజ్ఞ దొఱకలేదు ఆంధ్రులందఱును తహతహపడుచున్నారు ఒక దిక్కు కొల్లాపురములో వందలు వ్యయముచేసి మంటపములు సిద్ధముచేయు చున్నారనియు, నింతవరకు ఆ కార్యమునకై యెంతయో వ్యయమైనదనియు వార్తలు వచ్చు చున్నవి.
మఱియు కొల్లాపురము వారు ఈ సభలకు ప్రతికూలముగా నున్నారనియు, తాము తమ సంస్థానము హద్దులతో సభలుచేయ నియ్యమనియు ననుచున్నారని వినుచున్నాము సంస్థానము వారు సభలు రాజకీయములు కానంత వరకు, రాజద్రోహము చేయునవి కానంతవరకు తుదకు మతభేదములు యనుజ్ఞ నియ్యనొల్లరో యర్థమగుట లేదు. గష్తీనిషాను 53 వారికి వర్తించదని తలచినారా? ఖాల్సాకు మాత్రమే యీ గష్తీ వర్తించును మాకిది వర్తించదని వారు అనజాలరు
ఇప్పుడీ వ్యవహారము బాబెహుకూమతు వరకు పోయినదని వినుచున్నాము. ఒక వేళ బాబెహుకుమతు వారు సభ సంస్థానమందు చేయగూడదు, కావలసిన ఖాల్సాలో నెచ్చటనైనను చేయుడు. సెలవిత్తము" అని తీర్మానించిన (అట్లు చేయరని మా దృఢ విశ్వాసము) దీని ఫలితము చాల వికారముగా పరిణమించునేమో! ఇట్టి యాజ్ఞను ఆధారముగా గొని యికముందు కొల్లాపుర సంస్థానమందేకాక యే యితర జాగీరునందుకు తదధికారులు సభలనుచేయ నియ్యరని చెప్పవచ్చును. అట్టిచో సంస్థానములందుండు ప్రజలు చాలా కష్టముల