Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

వారికి భుక్తియు, ముక్తియు సమకూరును ధైర్వస్థైర్యములు గలుగును. ఇట్టి మంత్రమును జపించి ముక్తిబడయని దేశీయులుండజాలరు గదా!

గాంధీ మహాత్ముడు ప్రజల ఆర్థికస్థితి చక్కబెట్టుటకై పూనుకొనుటయే గాక దేశమునందు వ్యాపించిపోయిన దురాచారములను కూడ పెరికివేయుటకై పూనికొనెను మహాత్మునికి ముఖ్యముగా అస్పృశ్యత అమానుషమైనదిగా గన్పట్టెను భూతదయ బోధింపబడునట్టి భారతదేశమున తోడిమానవుల కుక్కల కన్న హీనముగా జూచుట మానుషలక్షణమునకు యోగ్యముగాదని తలంచి, అస్పృశ్యతానివారణమునకై భారతీయులకు ప్రబోధించెను ఈ దశాబ్దములో అంటరానితనము చాలవరకు తొలగిపోయినది దేశాభిమానుల ప్రయత్నమువలన నింకొక దశాబ్దములో అంటరానితనము పేరు లేకుండ సమసిపోగలదు.

గాంధీ మహాత్మునికి దైవముపై భక్తి మెండు. ప్రతి కార్యమునకు దైవ సహాయ మపేక్షించుచుండును ఉదయము సాయంత్రము భగవత్ ప్రార్థన సలుపును. దీని యొక్క యావశ్యకత ఇతరులకు బోధించుచుండును. ఇటీవల రాజవూతానా యెడలో నొక విద్యార్థి ప్రశ్నకు జవాబొసగుచు ఆత్మకు దైవప్రార్థనయను ఆహార మత్యవసరమనియు, ప్రార్ధన జేయు కొలది మానవునికి పరమేశ్వరునిపై విశ్వాసము హెచ్చుననియు బోధించెను మహాత్మునికి భగవద్గీతలోని నిష్కామయోగము మూలకందము. పరమేశ్వరునిపై నిట్టి అచంచల భక్తి యున్నను కొందఱు మతాభిమానులవలె మతమను పిచ్చిలోబడి ఇతర విషయములను వర్జించువాడు కాడు తన మతమే శ్రేష్ఠమని ఇతర మతము వారితో వాదించువాడు కాడు తన మతమెట్లు శ్రేష్ఠమో, ఇతరుల మతము కూడ నట్టిదే యని భావించువాడు సర్వమత సహనము మహాత్మునికి విలువలేని భూషణము. ఏ మతము సిద్ధాంతముల నుండి యైనను సద్విషయములను స్వీకరించుటకు సంసిద్ధుడు. కనుకనే అన్ని మతముల వారును, అన్ని జాతుల వారును, గాంధీ మహాత్ముని ప్రేమించుచున్నారు.

గాంధీ మహాత్ముడు రాజకీయవేత్త గాడని కొందఱు వాదించెదరు అయ్యిది నిరాధారమని తెలుపుటకు ఇటీవల రాజకీయ విషయములో అవలంబించుచున్న వైఖరి వలన గాన నగును. ఏ విషయము నందైనను మహాత్ముడు