Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

తీవ్రముగ జరుగ గలదని తలంచ వచ్చును ఈ రెండు మహాసభలొకసారి జరుపబడు చుండుటచే ఆంధ్ర మహాసభ ప్రాముఖ్యత తగ్గిపోవు చున్నది. ఎల్లరి దృష్టిని రాష్ట్రీయ సభయే ఆకర్షించు చున్నది స్థాయి సంఘసభ లపుడపుడు జరుగనందున దేశములో చలన మెంతమాత్రము లేకున్నది. ఇకనైనసు తీర్మానానుసారము స్థాయి సంఘము వారు ప్రతి మాసము గూడి అంధ్ర రాష్ట్ర నిర్మాణమునకు గాను తీవ్రమైన ప్రచారము చేయవలయును

ఇంతియే గాక గుంటూరునందు మరికొన్ని మహాసభలు జరిగినవి. వీనిలో హిందీ మహాసభకు ధర్మ వీర వామన రామచంద్రనాయకుగా రధ్యక్షత వహించిరి. వీరు రాష్ట్ర భాషయగు హిందీ యావశ్యకత నిరూపించుచు భావగర్భితమైన యుపన్యాస మొసగిరి హిందీ భాషకు రాష్ట్ర భాషయగుట కన్ని విధముల అర్హతగలదని తెలిపిరి వీరు సూచించినటుల విద్యాశాఖవారు ప్రతి పాఠశాలలో హిందీ బోధించుట కేర్పాట్లు గావించెదరని కోరుచున్నాము.