Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర మహాసభలు

4-7-1931

గత సంచికయందు ఆంధ్ర రాష్ట్రీయ మహాసభాధ్యక్షులగు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రారంభోపన్యాసమును విమర్శించుచు ప్రత్యేకాంధ్ర నిర్మాణావశ్యకత యెంతవరకు గలదో నిరూపించి యుంటిమి. ఇక ఆంధ్ర మహాసభయం దేమి తీర్మానింప బడినదో చూతము అధ్యక్షులగు వరహాగిరి వేంకట జోగయ్య పంతులుగారు ఆంధ్ర దేశమును ప్రత్యేక రాష్ట్రముగ నొనరింపవలయుననియు, ఇందుకుగాను ఆంధ్రదేశమున కన్ని విధముల అర్హత గలదనియు, నొక్కి వక్కాణించి యున్నారు. ఇట్టి ప్రాముఖ్యమగు విషయమున ఏ బుద్ధిమంతునికైనను భేదాభిప్రాయముండదని చెప్పగలము. ఆంధ్ర మహాసభ యొక్క తొమ్మిదవ తీర్మానము ఇట్లు గలదు ..

"స్వరాజ్య నిర్మాణమునకు భాషాప్రయుక్త రాష్ట్రము లావశ్యకముగాని రాబోవు రాజకీయ సంప్రదింపులలోను, రాజ్యాంగ నిర్మాణము నందును, ఆంధ్ర దేశమును ప్రత్యేక రాష్ట్రముగ నిర్మించు నేర్పాట్లు గావింపవలెనని యీ సభవారు మహాత్మాగాంధీ గారికి విన్నవించు చున్నారు.”

ఈ తీర్మాన మెంతయు సమంజసమై యున్నది. రౌండు టేబిలు మహాసభలు గాంధీ మహాత్ముడొకడే కాంగ్రెసు ప్రతినిధిగా వెడలు చున్నాడు గాన ఇట్లు తీర్మానింపబడినది మహాత్ముడు భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనసూత్రమును అంగీకరించియున్నాడు. అందువలననే కాంగ్రెసు సంస్థలు యీ విధానము ననుసరించి నెలకొల్పబడినవి

ఆంధ్ర మహాసభయందు గావింపబడిన తీర్మానములలో ముఖ్యమైనది మరియొకటి గలదు. ముందు ఆంధ్ర మహాసభను ఆంధ్ర రాష్ట్రీయ సభతో గాక ప్రత్యేకముగ జరుపవలయునను తీర్మానము.ఇందువలన ఆంధ్రోద్యమ ప్రచారము