106
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
నష్టమునకు లోనై యాగిపోయెను అదేవిధముగ "సుజాత" పత్రిక బహు నష్టమునకు పాలై నిలిచిపోయెను ఒకవేళ పత్రికలలో లోపముండినను ఆంధ్రులు వానిని భరింపవలెను తమ బిడ్డ మురికిదని యెవరును పెంటపై పారవేయరు కదాః మన యాంధ్రపత్రిక లిచ్చట ఉర్దూ దినకత్రికలకన్న నెన్నటికిని తక్కువ యైనవి కావని ఘంటాపధముగా చెప్పగలము కాని యదేమి వ్యామోహమో అనేకాంధ్రులు ఉర్దూ పత్రికలను (చదువ లేకున్నను) చేతబట్టిన నది కేవలము హస్తభూషణమే కాక గౌరవప్రదమని కూడ తలతురు మేనత్తకు మీసము లతికించినంత మాత్రముననే పిన్నబ్బ కానేరదు, కావున మా పాఠకులు మాచేయు సేవ మా పత్రికావశ్యకత, ఆంధ్రోద్యమమున కిది మూలకందమని తలచి మమ్మాదరించుటను బ్రశంసించుచు తక్కిన విద్యావంతులను, ధనికులను నీ పత్రికను బహుళముగా నాదరించు నీటుల ప్రోత్సహింతురని కోరుచున్నాము ఈ పత్రిక చిరస్థాయిగానుండి యాంధ్రుల ప్రతిభను దశదిశల ప్రసరింప జేయుటలో నగ్రస్థాన మలంకరించుటకై మా హితచింతకులందఱును చేయూత నొసగుదురు గాక!
మా పత్రికకు వ్యాసములును, వార్తలను పంపి, మాకు తోడ్పడిన విలేఖరు లందఱికిని మేమెంతయు కృతజ్ఞులము ముందుకూడ ఇదేవిధముగ సహాయపడెదరని కోరుచున్నాము.