Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

105

మేము మా పత్రికా స్థాపనా కాలము నుండియు రెండంగములు దృష్టిపధమందుంచుకొని దేశీయుల సేవజేయు చున్నాము మొదటిది యాంధ్ర భాషా సేవ. రెండవది జాతికుల వివక్షత లేక నిష్పక్షపాతముగా నాంధ్రులలో సర్వశాఖలవారి యొక్క సత్వరాభివృద్ధికై పాటుపడుట.

మన రాష్ట్రీయాంధ్రులలో విద్యావంతులమని చెప్పికొనువారిలో విశేషము వంతువారు మాతృభాషాభిమానములేని వారు అనేకులగు దొరలలో (అనగా కేవలము రెడ్లే కాదు వెలమలు, గోలకొండ వ్యాపారులు కూడ నీ దర్జాలో చేరిన వారు) వీరిలో జాతీయత కానరాదు వీరి వేషములబట్టి యెవరును వీరిని హిందువులని చెప్పజాలరు. వీరి భాషయు తెనుగు గాదు విశేషముగా హుర్దూ భాషయందే వ్యవహారములు జరుపుచుందురు అట్టిచో నాంధ్ర పత్రికలనినవారికి తలనొప్పి కలుగుటలో విచిత్రమేమియులేదు. మేము సర్వ శాఖలవారి యభివృద్ధికిగాను బాటుపడు విషయమునకు మా పాఠకులే సాక్షులు.

కాలము మారుచున్నది. నవీన భావములు ప్రబలుచున్నవి. దాని కనుగుణ్యముగా మనమును మన భావములను సవరించుకొనవలెను మన సాంఘికాచారములలో ననేకములీ నవీన కాలమునకు పనికిరావు రాజకీయముగా సహితము మనము చాల వెనుకబడియున్నాము మన రాష్ట్రములో ప్రజలకు రాజకీయాధికారములననేవో తెలియవు. ప్రపంచమందంతటను రాజకీయములు జనులకు ముఖ్య ప్రాణవాయువై యున్నవి ఏ రాజ్య వ్యవహారములు ప్రజల యనుమతిపై నడుపబడునో యా రాజ్యమందే రాజకీయ జ్ఞాన మున్నదని చెప్పవలెను. ఏ రాజ్యమందు రాజకీయమందు ప్రజలకు ........... లేదో యా దేశపు జనులకును చెంచువారికిని చాల భేదము లేదు కావున మేము ప్రజలకును ప్రభుత్వమునకు సూచించున దేమన మన రాష్ట్రములో ప్రజల తెలివి తేటలను వృద్దికి తేవలనని వారికి మునిసిపాలిటీలలో శాసన సభలలో ప్రాతినిధ్య మొసగవలెను

ఆంధ్రులందఱకును మా పత్రికను ప్రోత్సహించుట ధర్మమైయున్నది. ఈ రాష్ట్రమందలి యాంధ్రుల యాదరము తక్కువయగుటచేతనే అయిదు సంవత్సరములు సేవచేయు చుండిన 'నీలగిరి', 'తెనుగు' పత్రికలు గొప్ప