104
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
వ్యసనము కలుగుచున్నది ప్రజలే రీతిగా నేడ్చిన నింపుయుండునో, యాయేడ్పు ఎప్పుడు మన ప్రభుత్వ......యమును గరిగించునో యెవ్వరును దారి ...... వారు లేరై రి
గత సంవత్సరమందు ఆంధ్రులు కొంత దేశ... కార్యములు చేసినారు ముఖ్యముగా దేవర... సభ పేర్కొన దగినది. కాని యాంధ్రులలో కార్యదీక్ష చాలా తక్కువ. ఆంధ్రుల యభివృద్ధికి ఆంధ్రులే యాటంక పడువారు కాని యితరులు... ప్రతి గ్రామమందును పటేలు పట్వారీలు, దొరలు, దేశ పాండ్యాలు తమ తమ... జనులసేవ చేసినట్లైన యాంధ్రా... లోనే కాగలదు...
స్థితి యింకను హైక్య మొందుటలో నేమి సందేము. ప్రజలను పీడించి బ్రతుకుట రాక్షసకృత్యము. ప్రజల నోరు కొట్టి తమ కడుపులు నింపుకొనుట పైశాచము. ప్రజలను నిర్ధనులనుగా జేయుటడాకూలపని. ప్రజల నిరక్షరాస్యులనుగా నుంచుట నా స్తికత. ప్రజలే గ్రామమున కలంకారభూతులు. ప్రజలే దేశ సంపదలకు మూలకములు. ప్రజల యభివృద్ధి సర్వతో ముఖాఖి వృద్ధి. వారి నాశనమే సర్వనాశము .
ఈ సూత్రములను ప్రతి' విద్యావంతుడును, ప్రతి ధనికుడును దృష్టి యందుంచుకొని తమ సోదర ప్రజలను వృద్ధికి దేగలుగుదురు గాక !
మన రాష్ట్రములో పత్రికా పఠనాభిలాష యింకను చాల తక్కువ బ్రిటిషు హిందూ స్థానములో ఘోర కల్లోలములు జరుగుచుండినను గాంధీగారి పేరు విననివారు కొందరున్నారు. పేరు వరకు వినినవారు గాంధీగారు జైలు నుండి యెప్పుడు వచ్చెదరు అని ప్రశ్నించువారున్నారు. మన ధనికులకు మొకద్దమాలపై యున్న యభిలాషలో శతాంశముకాదు సహస్రాంశమైన పత్రికలపై నుండిన వారు తరించగలరు
కచ్చేరీ వ్యవహారములపై ఖర్చు పెట్టు దానిలో సహస్రాంశము పత్రికలపై కర్చుపెట్టినవారు వృద్ధికి వత్తురు. తుదకు వారు తమ విదేశీ సిగరేట్లకు దినమునకు నాలుగణాలు వ్యయముచేయుదురు. కాని పత్రికలకై వారమునకు రెండణాలు వ్యయము చేయనొల్లరు.