మా యాఱవ సంవత్సరము
9 - 5 - 1931
నేటికి మా గోలకొండ పత్రికకు అయిదు సంవత్సరములు పూర్తియైనవి. నిజాము రాష్ట్రమందు ఆంధ్ర పత్రికలకు అయిదవ సంవత్సరము గండము అని మా మిత్రులు చెప్పెడివారు. ఎట్లయినననేమి మా కా గండము తప్పినది.
మా అయిదవ సంవత్సరములో ప్రపంచమంతటను గొప్ప మార్పులు జరిగెను. బ్రిటిషు హిందుస్థానములో ముఖ్యముగా నెన్నడును జూడనట్టి సంచలనము జరిగెను దేశమంతయు సత్యాగ్రహతత్వముచే నిండిపోయెను వేలకొలది జైలుకు పోయిరి. వేలకొలది దెబ్బలు తినిరి. అనేకులు ప్రాణము లర్పించిరి. తుదకు గాంధీ - ఇర్విన్ ఒడంబడిక జరిగెను కాని యిట్లు అచ్చట ప్రచండ సంచలనము జరిగినను మా రాష్ట్రము మాత్రమే చిక్కులు లేక సుఖముగా నుండుట విశేషము అయినను బ్రిటిషు హద్దులపై యావరించెడి భావములు గాలిచే నిచ్చటికి కొన్ని గొట్టకొని వచ్చిన వనుట నిస్సందేహము మన రాష్ట్రము నుండి గోల్మేజు సభకు ప్రభుత్వ ప్రతినిధులు వెడలియుండిరి. సభలో మన ప్రభుత్వ నియోజితులు మన రాష్ట్రమును గూడ ఫెడరల్ ప్రభుత్వములో చేర్చుటకు యంగీకరించియున్నారు.
ఈ యంగీకారము చాల ముఖ్యమైనది ఏలన సివిల్ పద్ధతిలో మన రాష్ట్రము చేరినట్లైన......ప్రజా ప్రాతినిధ్య సంస్థ లేర్పడుట తధ్యము
గత సంవత్సరమందు మన రాష్ట్రములో...... మార్పులు విశేషముగా లేవు ..... సం॥లో అయిన ఖాన్గీ పాఠశాలల గష్తీ.......... రెండేండ్ల క్రిందటి 53 వ సభల గష్తీయును యుండిన మార్పులు జరిగినవని చెప్పగలుగు...... కాని ప్రజల మొరలు మన ప్రభుత్వము చెవికింకను బాగుగా నెక్కలేదని మాకు