100
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
మక్కికిమక్కిగాని వాడక మాటలలోగాని జరుగదు. కొన్ని వేళలందు వీరు చెప్పునదొకటి వారు చెప్పునది మరి యొకటియై యుండును కనుక సరియైన న్యాయమును బడయుట మిక్కిలి దుస్తరమగుట సంభవించును, కనుక ఉన్నత న్యాయశాఖాధికారులీ విషయమున శ్రద్ధవహించి ఈ లోపమును తొలగించుటకు కృషి సలిపెదరని నమ్ముచునియ్యది వారి విద్యుక్త ధర్మమని హెచ్చరించుచున్నాము
ఈ విషయమును అధికార వర్గము ఒక్క జవాబుతో తెల్పివేసెదరని మాకు తెలియును ప్రస్తుత మెట్టి యేర్పాటు చేయుటకు "గుంజాయిషు" లేదని చెప్పుటయే వారి జవాబై యుండును న్యాయము ప్రసాదింపబడుటలో నీజావాబు తృప్తికరమైనదిగా జాలదని ప్రపంచమంతకును విదితమైయున్నది కనుక అధికార వర్గము జనసామాన్యము యొక్క అవసరమును ప్రజాభిప్రాయమును చేయూతగాగొని ప్రభుత్వము నీ విషయమున బలవంతపెట్టవలెను న్యాయశాఖా వ్యవస్థయందు విస్పష్టముగా గానవచ్చుచున్న నీ కళంకమును దొలగించుటకు కృషిసలుపవలెను జనులు సరియైన న్యాయమును బడయవలెననుటయే మా దృష్టియందున్న విషయము. వ్యవస్థను విమర్శించి కళంకములను ఆక్షేపణ పూర్వకముగా జూపించవలెననెడి యుద్దేశ్యమే మాత్రముగాదు. ప్రజాభిప్రాయముతో బాటు అధికార వర్గము యొక్క సహాయముతో ప్రభుత్వము వారి దృష్టినిప్పట్ల నాకర్షించుటయే మాయాశయము. కనుక లక్షల కొలది రూప్యములు రాష్ట్రతర ప్రాంతములకై వినియోగింప బడుటయు రాష్ట్రయుల యోగక్షేమమున కత్యంతవసరమైన వ్యయమునకై గుంజాయిషు లేదనుటయు సరియైన పద్ధతిగాజాలదు కనుక ప్రభుత్వమువారీ విషయమున శ్రద్ధవహించెదరుగాత