సురవరం ప్రతాపరెడ్డి
99
మనరాష్ట్రములోని ఉన్నత న్యాయ సభ యొక్క ప్రధాన న్యాయాధీశులు అనేక పర్యాయములు గష్తీల ద్వారాను, ఆహకాయుల మూలమునను నిందితుల యొక్క వాఙ్మూలములను వారి మాతృభాష యందే రికార్డుచేయవలెనని నియమ మేర్పరచియున్నారు ఇట్లు జరుపుటకు వీలులేనిచో భాషాంతరీకరణ మొనర్చుటలో చాలా జాగ్రత్త వహింపవలెనని హెచ్చరించియున్నారు. ఈ విషయమునందెంత వరకు శ్రద్ధవహింపబడుచున్నదో సృష్టమే. అదాలతులతో సంబంధము గల వారందరునునైక కంఠముతో నీ విషయమున అదాలతు పని, వ్యవస్థ ప్రయోజనకారిగా లేదని చెప్పగలరు. ఈ విషయము ముఖ్యమైనదని వాదించుటకు మేము వెనుదీయము కాని ఇంతకంటె నెక్కువ లోపము గనబడుచున్నందున "ఉత్తముండకంటె అత్తముండమేలు" అని మాత్రము చెప్పవలసి వచ్చుచున్నది
మనరాష్ట్రములోని దివానీ భాగమునందు గౌరవన్యాయాధిపతులకు మూడవ దర్జా అధికారములు గలవు. మున్సిపులకు ఫౌజ్దారీలో జిల్లామెజిస్ట్రేటు యొక్కయు, దివానీలో 1000 రూ. అభియోగములను విచారించు అధికారములు గలవు. బ్రిటిషు ఇండియా కంటె ఈ విషయమున మనమెంతో ముందున్నాము మన తాలూకాలలో నుండు ప్రతి యొక్కనికిని అన్నిటికంటె నెక్కువయైన న్యాయస్థానము నుండి న్యాయము బడయు సౌకర్యమున్నది కానినిట్లు నిర్భయముగా చెప్పుటకు హృదయకంపముగలుగుచున్నది. ఏలననగా మనము నిజమైన న్యాయమును బడయుట లేదు. ఇందుకు ముఖ్యమైన కారణమునరయుదము గొప్ప అధికారములు గల మన మున్సిఫి మెజిస్ట్రేటుల వద్ద వాఙ్మూలముల నిచ్చు సాక్షులలోను, కక్షదారులలోను నెక్కువ భాగము అదాలతీ భాష దెలిసిన వారు కారు న్యాయస్థానము (అదాలత్ )నకు దేశభాషల పరిచయము లేదు భాషాంతరీకరణమొనర్చు ఉద్యోగులు నియమింపబడియుండరు. కనుక తీర్పు చెప్పువారు తమకు తెలియని భాషలో జరుగు వ్యవహారమును నెట్లు పరిశీలించగలరు? ఈ పరిస్థితులలో “దుబాసి" (తర్జుమాపనిచేయువారు) సామాన్యముగా అదాలత్ చప్రాసీయో లేక హాజరున్న వారిలో నెవరోయైయుండిన ముఖ్యమైనట్టియు, బాధ్యతాయుతమైనట్టియు కార్యభారమును నిర్వహించి న్యాయస్థానమునకు న్యాయపరిశీలన కార్యమునందు తోడ్పడుదురు. తర్జుమాయైనను