Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

89

లున్నారు వారందరి దృక్పధము మారినట్లైన నిజమైన పత్రికలేవియో బయట పడును. కుక్క కూనలలో మంచివేవి యని పరీక్షించుటకై వాని నన్నింటిని బావిలో వేయుదురు. అని పనికి రానివి యడుగునకు పోవ... మం... చివి యీదుకొని వచ్చును ఇటులే మా రాష్ట్రములోని సర్వ పత్రికల చందాదారులను పత్రికలను పరీక్షింపవలెను.

ఈ సంవత్సరము మేము.............లో నొక ముఖ్యముగు..........చేయుచున్నాము ప్రజల యొక్క అభివృద్ధి తృప్తికరముగా నుండుట పత్రిక యొక్క పరిమాణమును పెద్దగా చేసి 12 పుటల నుండి 16 పుటల వరకు ప్రతి తడవ యిచ్చివేయుచున్నా...ము ఈ సైజులో ప్రచురించుట యుండుననగా పూర్వము సైజుకన్న రెండు వేలు పెద్దదిగా చేయుట యని పాఠకులకు నివేదింపనవసరము లేదు

ఇంత వరకు మాయందు అభిమానముంచి మాకు తోడ్పడిన సోదరులకు అందు ముఖ్యముగా మా రాజపోషకులకు, పోషకునికి, అభిమానులకు, విలేకరులకు మేము కృతజ్ఞతా వందనము అర్పించుచున్నాము. పత్రిక చిన్నది. కార్యము పెద్దది. మా రాష్ట్ర సోదరుల అభిప్రాయమును గాని, వ్యాసములు గాని, ప్రచురించుటలో, మేము స్థల సంకోచముచేత అనేక మారులు ఆలస్యము చేయుటయో, లేక ప్రచురింపకపోవుటయో కావించి యుందుము. ఈ లోపములను మన్నించి యందరును మాకు దోడ్పడుదురని ప్రార్థించుచున్నాము.