88
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
రాష్ట్రులును గలరు మహారాష్ట్రుల సంఖ్య తెలుగు వారలు సగమే యుండినను బ్రిటిషు రాజ్య మహారాష్ట్రులు - అనగా బొంబాయి రాజధానిలో మహారాష్ట్రులు తమ సోదరుల యెడ అత్యంత సానుభూతి చూపుచున్నారు పత్రికలందేమి, గ్రంథములందేమి, సభలందేమి, సర్వ విధములవారు తమ ప్రాంతములలో తమ సోదరుల విషయమై శ్రద్ధ పుచ్చుకొనుచున్నారు. ఈ శ్రద్ధ కొంచము శ్రుతి మించినదిగా కూడ నున్నది. కావుననే కొందరు మా రాష్ట్రమునుండి 'షేరు బదల్' అయిరి కొన్ని మహారాష్ట్ర పత్రికలు రాష్ట్రములోనికి రాకుండ నిషేధింపబడెను కొన్ని మహారాష్ట్ర గ్రంధములు కూడ నిషేధింపబడెను.
ఇది యిట్లుండ మా మద్రాసు రాజధానిలోని యాంధ్ర సోదరులు మాకేమి చేసిరని ప్రశ్నించుచున్నారు. అచ్చట పత్రిక లిక్కడి వార్తలనే ప్రకటించుట లేదు. నిజాము రాష్ట్రపుటాంధ్రులకు బ్రిటీషు రాష్ట్రపు జనులకు కాంగ్రెసు యెట్లో అట్లు ప్రధానమైన ప్రధమాంధ్ర మహాసభ జరుగగా దాని వార్తయైన యచటి పత్రికలు ప్రకటింపకపోయెను. ఇక ముఖ్యోపన్యాసములలో తీర్మానములు అచ్చువేయు దాతలెవరు? మొత్తము పై మాయనుభవమున మహారాష్ట్రులలో నుండునంతటి ప్రేమ మా యాంధ్రులలో లేదు
ఇక మా రాష్ట్రములోని యాంధ్రుల స్థితిని విచారింతము. మీ సోదర రైతులను పాటకపు జనులను వర్తకులును - అనగా ఆంధ్రులందరు యవాచ్యహీనస్థితులు నుండినందులకు వర్తక రైతు సంఘములే తార్కాణము. ఈ సంఘముల ముఖ్యోద్దేశము ప్రజలు తమపై యన్యాయమైనట్టి దౌర్జన్యము లెవ్వరును చేయకుండుటకై యాత్మ సంరక్షణము చేసికొనుట అనగా వీరికింతవరకు కష్టములే కలుగుచున్నవని దీని భావము.
నిజాము రాష్ట్రము ఏ శతాబ్దములో వృద్ధికి రావలయునో యెన్నడు సర్వసంస్థానములందు నిజాముగా యుత్కృష్టమైనదని యనిపించు కొనునో, మా జ్యోతిష గణితములో నగోచరముగా నున్నది మేము మాత్రము మా శక్తి కొలది ప్రజా సేవ చేయుచుందుము. కాని ప్రజలు మాత్రము, తమ ధర్మము నెరవేర్చుట లేదు మేము పైన వర్ణించిన నీసమగ్రపు ఉర్దూ దిన పత్రికలకు ద్రవ్యము హెచ్చుగా నిచ్చికొనుటలో గౌరవము అని భావించు సోదరులనేకు