సురవరం ప్రతాపరెడ్డి
87
............. వంక వాగ్బంధన విధానము ...............వృద్ధి నొందుచుండ నింకొ............పత్రికా ధ్వంసకము ప్రారంభమయ్యెను. సుమారు మూడు సంవత్సరములనుండి రైతుల పక్షముననే తన కలము నుపయోగించిన రయ్యతు పత్రికనోట నీరుపోయు వారైనను లేక దిక్కులేని చావు చచ్చెను పాపము 9 వారములైన సరిగా ప్రపంచ వెలుతురు చూడని (న్యూయీరా) పత్రిక పురిటిలోనే గంతుకొట్టెను ఇంక మా గోలకొండ, రహబరె దక్కన్, సుబెదక్కన్, పత్రికకు మందలింపుచే భీతి కలిగెను. మన రాష్ట్రములో పదియవ భాగమైన తిరువాన్కూరు సంస్థానములో సుమారు 600 పత్రికలున్నవి కాని మన రాష్ట్రములో 6 పత్రికలైనను సరిగా లేవు. మా రాష్ట్రమున దినపత్రికలు పత్రికలే కావు మా ఉర్దూ దినపత్రికలు పలుమారు సంపాదకీయములే వ్రాయవు మా ఉర్దూ పత్రికలకు సంవత్సరమున ఒక్కొక్క తంతి వార్తకూడ రాదు। బుల్లెటిన్ పత్రికను పట్టుకొని రాత్రి కూర్చుని దానిని అనుకూలమున్నంత వరకు తర్జుమా చేసికొని ప్రొద్దుననే అచొత్తి బయటపడునట్టివి మా దినపత్రికలు ఇక మా బుల్లెటిన్ కూడ విదేశ వార్తలను నిచ్చుటలో చాల యాలస్యము చేయుచున్నది ఈ పత్రిక లన్నింటిలో మన రాష్ట్రములోని జిల్లాలలో నేమి జరుగుచున్నదో తెలియనే తెలియదనవచ్చును. ఈ జిల్లాల వార్త లిచ్చుటలో మా గోలకొండయు, నిజాము విజయము తప్ప తక్కిన పత్రిక లిచ్చుటయే లేదనిన యతిశయోక్తి కాదు!!
ఇట్టి స్థితిలో యిట్టి యంధకారములో మేము తగుల్కొనియున్నాము. ఇక మా యాంధ్రుల సంగతి కొంత విచారింతము. ప్రస్తుత రాజకీయ హద్దులను బట్టియు, మా రాష్ట్ర భూగోళమునుబట్టి యేమి మద్రాసు భూగోళమునుబట్టి యేమి నిజాము రాష్ట్రము వేరు, మద్రాసు రాజధాని వేరు కావున ఉభయ ప్రభుత్వములు బ్రిటిషు ఆంధ్రులను నిజాము ఆంధ్రులనుండి విడదీసి యున్నారు. అయినను నీ యుభయాంధ్రులలో సామీప్యసారూప్యములు లేకపోలేదు. 64 లక్షల సోదరులను దక్షిణ ఆఫ్రికాకు పోయిన కూలీలనుగా తక్కిన యాంధ్రులు చూడజాలరుగదా! అయినను అటులే చూచుచున్నట్లు మాకు గోచరించుచున్నది.
ఈ రాష్ట్రములో తెలంగానా మరట్వాడ ముఖ్య రాజ్య విభాగములు, అందు తెలంగానాలు 64 లక్షలు యాంధ్రులు, మరాట్వాడాలు 32 లక్షల మహా