Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సావర్కర్ ప్రవాసము

16 - 2 - 1929

బెజవాడ దుర్గా విలాసమునందు సమావేశమైన ఆంధ్ర రాష్ట్రీయ కాంగ్రెసు సంఘ సభవారు సావర్కర్‌గారి ప్రవాస కాలమును మరింత కాలము హెచ్చించి నందులకు ప్రభుత్వము వారి చర్యను ఖండించుచు నొక తీర్మానమును గావించిరి సావర్కర్ యువకుల నాయకుడు దేశమునకై పాటుబడిన యోధుడు నేటికిని ప్రభుత్వపు దారియందు తగుల్కొని శల్యావశిష్టుడైయున్న వీరుడు ఇక వారి విడుదలకై తీర్మానములు గావించిన లాభములేదు. యువకులగు వారు సక్రమ యాందోళన జరిపి సావర్కర్‌ను తిరిగి తమ యందొకనిగా కలుపు కొనవలయును. అప్పుడే మనయొక కార్యమును సాధించిన వార మగుదుము.