పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జ్యోస్యం చెప్పినట్లు పురాణగాధలున్నాయి. అంటే ఎఱుక అంతపురాతనమైనదన్న మాట.

పల్లెటూళ్లల్లో ‘ఎఱుకలు ‘ అని ఒక జాతి ఉంది. ప్రభుత్వం వీరిని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చింది. వీరు పందులను మేపుతుంటారు. అంతేగాక మగవాళ్లు ఉండేలు బద్దలతోనూ, నాటుతుపాకీలతోనూ పిట్టలను కొట్టి అమ్ముతారు. ఆడవాళ్లు పురుళ్లు పోస్తారు మంత్రసానుల్లాగ. కొందరు ఎఱుక చెబుతారు.

తలపై కొప్పు, ముక్కున మక్కెర, నెత్తిన ఎఱుకల్బుట్ట, బుట్టలో పసుపు రాసిన చిన్న చేట ఇవీ ఆమె సామాగ్రి. ఇంటిలో ఎవరికైనా అనారోగ్యంగాఉన్నా, పిల్లలకు బాలగ్రహాలు పట్టుకున్నా ఈమను పిలిపించి ఆడవాళ్లందరూ చుట్టూచేరి మూడు దోసెళ్ల బియ్యం ఆమె చేటలో పోసి సోదె చెప్పమంటారు. ఆమె పెద్దాపురం మరిడమ్మ, కాండ్రకోట నూకాలమ్మె, బెజవాడ కనకదుర్గమ్మ వగైరా దేవతల పేర్లు తలచి సోదె చెప్పడం ప్రాతంబిస్తుంది. ఎందుకు పిలిప్ంచారో, అనారోగ్యం ఎవరికో వారి మాటల వల్ల ఆమె ముందే త్రెలుసుకుంటుంది దానికి చిలవలు పలవలుచేర్చి చిత్రమైన బాణీలో పూనకం చచ్చినట్లు ప్రతివాక్యం గడగడా చెప్పుకు పోతుంటే అందరూ నిశ్చేష్టులైవింటూ ప్రశ్నలువేస్తూ, చెప్పేతీరునుబట్టి ఆ సమాఎధానాలు నమ్మి ఆమె అదేశించినట్లు చేస్తారు. రోగనివారణకు సాధారణంగా కోడితోగాని పందితోగాని దిగదుడుపు పెట్టాలంటుంది. దిగదుడుపంటే మూడు తవ్వల బియ్యం అన్నం వడ్డించి బుట్టలో పెట్టి, ములగకూర, తెలగపిండి కలపి వండిన కూర దానిలో కలిపి, కొంచెం అన్నం పిసికి చిన్న ప్రమిదలా చేసి దానిలో నూనె పోసి ఆ దూది వత్తువేసి వెలిగించి, నల్లకోడిపట్ట పీకకోసి ఆ రక్తంతో రోగినుదుట బొట్టుపెట్టి, ఆకొడినె ఆ అన్నం బుట్టనీ రోగి తలచుట్టూ మూడుసార్లు త్రిప్పి ఆ బుట్ట ఊరవతల పారేయిస్తుంది. కొడిని ఎఱుక తీసుకుపోతుంది. రోగ తీవ్రతబు బట్టి ఆ తుడవ డప్పులతోకూడా పోయిస్తుంది. అంటే ఆ బుట్ట తీసుకువెళ్ళేటప్పుడు డప్పులు వాయిస్తూ తీసుకువెడతారన్నమాట. పందితో దిగదుడుపంటే పంది యొక్క పీక కాకుండా దాని కాలివేలి చివర రక్తం వచ్చేలాకొసి, ఆ రక్తం అన్నంలో కలుపుతుంది. ఆపంది ఆమెదే. దాన్నలా వినియోగించి నందుకు కొంతడబ్బు వసూలు చేస్తుంది. రోగం