పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ గద్దెలపై నిలుపుతుంటారుకొందరు. తల్లిదండ్రులు, ఇక్కడ వీరభద్రుడుగా ఒక పెద్ద విభూతిపండు, అతని భార్య భద్రకాళిగా ఒకలక్కబొమ్మ పెడతారు. ఇలా ఒక్కోగద్దిమీద 40, 50 దాకా వీరభద్రులుంటారు. వీనికి నిత్య పూజాదికాలు ఆ గద్దే నిలిపిన గణాచారి చేస్తుంటుంది.

ఇళ్ళల్లో అవరికైనా నలతగా ఉన్నా, దీర్ఘరోగాలు వదలకున్నా, కష్టాల్లో ఇరుక్కుపోయినా, చేతబడి అనుమానాలున్నా, అర్ధరూపాయి దిగదుడిచి ఆ మనిషి బంధువులెవరన్నా, (మేనత్త వరసవాళ్ళు) ఈ గణాచారి వద్దకు వెళ్ళి ఇచ్చి ఎదురుగా కూర్చొని సాంబ్రాణి పొగ వెయ్యగానే గణాచారి పెద్దగా నాలుగైదుసార్లు ఆవులించి, మూడు నాలుగుసార్లు త్రేన్చి తల విరబోసుకొని శివ చెప్పడం ప్రారంభిస్తుంది. గోవిందాగోవిందా అంటూ. శివంటే పూనకం, ఆ వచ్చినవాళ్ళ తాలూకు వీరభద్రుడుగానీ, వాళ్ళతాలూకు చచ్చిపోయిన పెద్దలుగానీ, వెంకటరమణమూర్తి గానీ, సత్యనారాయణస్వామిగానీ, ఆ గణాచారిని అవేశించి వీళ్ళ ప్రశ్నలకు జవాబులు చెబుతారు. ఈ శివంకి వెళ్ళీనవారిముందుప్రిచయంలోనే వారు వచ్చిన విషయం గ్రహించేసి శివంలో వాళ్లడక్కుండానే సమాధానాలు చెప్పేస్తుంది. అలా రానప్పుడు వెళ్ళినవాళ్ళే ఆ ఆవేశించిన శిక్తిని సూటిగానే ప్రశ్నించి సమాధానాలు రాబట్టుకుంటారు. ఎ శివంలొ చచ్చిపోయినవాళ్ళూ, దేవుళ్ళూవచ్చి మాట్లాడడం, వాళ్ళతో వెళ్ళినవాళ్ళు మాట్లాడడం చూస్తే బలే గమ్మత్తుగా ఉంటుంది. ఇందులో మాటమీద నమ్మకం కలుగజేసేది గణాచారి వాగ్ధాటి మాత్రమే. ఏదుకొండ్లవాడో, మరోదేవుడ్ఫ్ వంకర చేసారనేది వీళ్ళు సాధారణంగా చెప్పేది. వంకర అంటే వీళ్ళు ఎదో అపచారం చేయడంవల్ల్ అదేవుళ్ళు ఆగ్రహించి కీదు కలిగించడం, చివరన గణాచారి ఆ కీడు తొలగిపోవడానికి, రోగం నయంకావడానికి విభూతి మంత్రించి యిస్తుంది వాళ్లకి బొట్టుపెట్టమని. పల్లెల్లో యీ శివంమీద ప్రజలకు చాలా విశ్వాసం. ఈ గద్దెలకు తూర్పు గోదావరిలో కుతుకులూరు, కొంకుదురు, ప్రత్తిపాడు, రాయవరం ప్రసిద్ధి.

                         ఎ ఱు క

ఆది దేవుడు పరమేశ్వరుడు ఎరుకలసాని వేషం వేసుకొని పార్వతికి ఎ ఱుక చెప్పినట్టు, వెంకతేశ్వరస్వామి ఎఱుక వెషంతో వెళ్లి పద్మావతికి