పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాటైనా మాటైనా ప్రతిభవంతుంగాపలికే రామకృష్ణారెడ్దికి నా అభినందనల్.

--జ్ఞానపీఠావార్డు గ్రహీత, పద్మభూషణ, పద్మశ్రీ, ఆచార్య

               డా. సి. నారాయణరెడ్డి
          వైస్ చాన్సలర్, తెలుగు యూనివర్సిటీ.

అభినంధ్యులు రామకృష్ణారెడ్డి

తెలుగువారి జానపదకళలు, వేడుకలు, సంబరాలు, ఆటలు, పాటలు, మాటలు మొదలైన వాటిగురించి మీరు చాలాసమాచారం సేకరించారు. ఇన్నిటిగురించి ఇంతవరకూ ఎవ్వరూ ఒక్కచోట సంగ్రహించలేదు. మీకృషి ప్రశంశాపాత్రము. దీపముండగానే యిల్లు చక్కదిద్దుకోవాలి. కొన ఉపిరితోనున్న యా కళలగురించి భావితరాలవారికి తెలియటానికై నా మీ పుస్తకం బాగా ఉపకరిస్తుంది. ఇది గొప్ప సిద్ధాంతగ్రంధం.

ఒకవైపు ఉద్యోగధర్మం నిర్వహిస్తూ, మౌలికమైన రచనలుచేస్తూ తీరికచూసుకొని జానపద కళారూపాలగురించి పరిశోధనాత్మక గ్రంధం అందించినందుకు ముమ్ము అభీనందిస్తున్నాను.

                  ---ప్రొఫెసర్, డా. బిరుదు రామరాజు ఎం.ఎ,పి.హెచ్ డి, ఉస్మానియా యూనివర్సిటీ.

పండిత పామర జనకం:

                               రామకృష్ణారెడ్డిరచన

బాధ్యతగలఉద్యోగం నిర్వహిస్తూ ఇటువంటి పరిశోధనాత్మక గ్రంధం వ్యాయటమనేది సామాన్యమైన పనికాదు. మీరు చెప్పిన చాలా విషయాలు ఆయా కళారంగాలలో నిరంతరం పరిశ్రమచేస్తున్న వారికి కూడా సంపూర్ణంగా తెలియవేమో!