దయ్యాలు - భూతాలు
జానపదులు చేలకు నీరు కట్టడానికి, పంటలు దొంగలపరం కాకుండా చూసుకోవడానికి రాత్రులు పొలాల్లో తిరుగుతుంటారు. రాత్రి తమకు కొరివిదయ్యం క్నిపించింది అంటుంటారు. ఈ కొరివిదయ్యాలు మండుతున్న కొరివిలాగ, లాంతర్లు పట్టుకు నడుస్తున్న మనుషుల్లాగ దూరంగా కనిపిస్తూ గాలిలో తేలియాడుతుంటాయి.
తూర్పు గోదావరి జిల్లా కొంకుదురులో వీనిని గురించి ఆసక్తిదాయకమైన ఒక కధ చెబుతారు అది నిజంగా జరిగిందంటూ. రెండుతరాల క్తితం కనళయ్య గారనే ఒకపెద్ద మనిషి వీధిలో మంచంవేసుకు పడుకొని నిద్రపోతుంటే కొరివిదయ్యాలు ఆయన్ని మంచంతోపాటే "వోం వోం కనళాబొజ్జా" అంటూ మోసుకుపోయి ఊరవతల ఆ మంచంతోబాటే నక్కల పాటి రావిచెట్టుదగ్గర రావిచెట్టుపైన పెట్టాయట. అలాతీసుకువెళ్ళేటప్పుడు ఆ అర్ధరాత్రిఆమాటలు వినబడుతున్నా అని దయ్యాలని భయపడి ఎవ్వరూ ఇళ్ళలోనుంచి బయటకి రాలేదట. మంచంమీద మనిషికి మెలుక వచ్చి కూడా మాట్లాడితే ఏంచేస్తాయో అని నోరు మూసుకుని పడు;కున్నాడట. తెల్లవారాకా చెట్టు దిగొచ్చాడట.
ఈ దయ్యాలూ భూతాల మీద అక్కడే మరొక కధ కూడా చెప్పుతారు నిజంగా జరిగిందని. ఓ ఏభైఏళ్ళక్రితం ఆవూరి దేవాలయం దగ్గర ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేదట. ఆ బ్రాహ్మణ కుటుంబంలో అన్నగారు మంత్రతంత్రాలు ఎరిగినవాడు. తమ్ముడు నూనూగు మీసాల నూతన యవ్వనంలో మిసమిసలాడుతున్న గొప్ప అందగాడు- పైగా బ్రహ్మచారి. వారికి వ్యవసాయముంది. అందువల్ల తమ్ముడు ప్రతీరాత్రీ పొలంలో పంట కాపలాకు అరవ వేసుకొని దానిపై పడుకునేవాడట. ఒక అర్ధరాత్రి ఒక అపురూప సౌందర్యరాశి అయిన సుందరి వచ్చి అతనిని నిద్రలేపి సంభోగానికి ప్రోత్సహించిందట. ఆమె సౌందర్యానికి ముగ్దుడైన అతను ఆమెను రమించాడట. తల్లవారక ముందే ఆమె వెళ్ళిపోయింది. ఇలాగే ప్రతీరోజూ జరుగుతుండేదట. పదిరోజులు పోయేసరికి అతను చాలా నీరసపడిపోయి పది లంఖణాలు చేసిన మనిషిలాగ అయిపోయేడట. ఇలాగ పీడ ముఖం పడిపోయిన తమ్ముణ్ణీ గమనించిన