పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డానికి వెళ్ళాడు. ధర్మరాజు వ్యాసుని తామిలా రాజ్యభ్రష్టులగుటకు కారణ్మెమని అడిగాడట. పూర్వం శ్రీకృష్ణుడు చెప్పగా జయముకోరి ద్రౌపది యీవ్రతం చేస్తుండగా అర్జునుడు చూసి నాజేడామీది మృగమును పూజించుట నాకవమానమని కోపంతో ఆమెచేతి తోరమునుత్రెంచి వేయమని ఆజ్ఞాపించాడట. పతివ్రత యగు ద్రౌప్ది భర్త ఆదేశాను సారం వ్రతతోరం త్రెంచివేసి దీక్షను విరమించింది. పదమూడుముళ్ళుల్గల తోరం తెంఫివేసినందున పదమూడు సంవత్సరాల అరణ్యవాసం వచ్చింది అనిచెప్పేడు. తరువాత యీవ్రతంచేసి ధర్మరాజు రాజ్యం పొందాడని కధాభాగం. విద్యార్ధులు విద్యలో విజయంఅ పొందాలని ఇది చేస్తారు.

108 అప్పాలు హనుమంతుని మెడలో దందగుచ్చి వేస్తారు. లేత తమలపాకులతో పూజ చేస్తారు. ఆ ఆకులు భక్తులకిస్తారు. ప్రసాదంగా అవి కాడకూడా పారెయ్యకుండా నమిలి మ్రింగాలి. అదే దెని శిష్ఠత. అంత నిష్ఠతో చేస్తారు జానపదులు.

వరలక్ష్మివ్రతం

ఇది ముఖ్యంగా ఐశ్వర్యాభివృద్దికోసం చేసేవ్రతం. స్తీలే చేస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం దీనికి నిర్ధిష్టమైన రోజు. 'అస్మాకం సహకుటుంంబానాం క్షేమ స్థయిర్య విజయాయురోగ్య ఐశ్వర్యాభివృధ్యర్ధం, ధర్మార్ధకామమోక్ష చరుతుర్విధఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం, సత్సంతాన సౌభాగ్య ఫల ప్రాస్త్యరం ' అని సంకల్పం చెప్పుకుని చెంబుకు గంధం అద్ది, కుంకుమ బొట్టుపెట్టి, నీటితో నింపి, గంధపుష్పాక్షతలు వేసి మర్రిచిగుళ్ళు, మామిడి చిగుళ్ళు మొదలగు పంచపల్లవములు, తామరపువ్వు, కొబ్బరికాయ ఆపాత్రపై నిలిపి, దానిపై వరలక్షిదేవి రూపు ఉంచి, (చిన్న బంగారు బొమ్మ) కుడిచేత్తో ఆకలశం పట్టుకొని వరలక్ష్మీ దేవిని 'సర్వమంగళ మాగళ్యే విష్ఠువక్షస్థలాలయే, ఆవాహయామి దేవీత్వం సుప్రీతాభవసర్వదా, శ్రీ వరలక్ష్మీమావాహయామి ' అని అవాహన చేసి 'పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే, నారాయణ ప్రియేదేవి సుప్రీతాభవ సర్వదా ' అనే శ్లోకంతో ఆర్ఘ్యపాద్యాదుల అష్ఠొత్తర శతనామాలతో షోడశోపచారపూజచేసి, ప్రదక్షిణ నమస్కారలతో