పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తామే సరిదిద్దుకుంటారు. వ్యవసాయం చేయడంలో కొన్ని కమతాలు కలిసి సమిష్టిగా తమపొలాలు దున్నుకోవడం. కుప్పనూర్పులు చేసుకోవడం చేస్తారు. పొలాలలో పంట బాగా పండినప్పుడు దానికి దిష్టి తగలకుండా గడ్డితో మనిషిబొమ్మచేసి దానికి దుస్తులుతొడిగి చేనుమధ్య కర్ర ఫాటీ కొందరు మట్టిముంతను సున్నముతో బొట్లుపెట్టి మనిషిముఖంలాచేసి నిలబెడరారు. ఇందులో దిష్టితగలకుండా చేయుట ఒక ఆలోచన అయితే, రాత్రులు గొంగలకు ఎవరో మనిషికాపలా ఉన్నాడనే భ్రాంతి కలిగించడం ఒక ఆలోచన. అక్రమంగా పశువులు ఇతరుల పొలాలలో మేస్తూ ఉంటే దానిని అరికట్టే కట్టుబాటు బందెలదొడ్డిలో పెట్టడం.

                    "గట్టిగా పెంపదక్షతలేక నూరూర
                      బందెల పడిపోయె పశుగణంబు" (మనుచరిత్ర)

9. వృ త్తు లు :

మేదగులు బుట్టలుఇ, తట్టలు అల్లుతారు. తాపీపనివారు ఇళ్ళు కడతారు. కరణాలు లెక్కలు వ్రాస్తారు. పురోహితులు గ్రామంలో ఇంటింటికీవెడళ్ళి శుభాశుభాలు చెపుతుంటారు. కమ్మరులు రైతుకు కావలసిన నాగళ్ళు, కొడవళ్ళు, గునపాలు, పారలు వగైరాతయారు చేస్తారు. కంసాలి వెండి, బంగారు ఆభరణాలు తాఅరుచేస్తారు. చాకళ్ళు బట్టలు ఉతుకుతారు. మంగళ్ళు క్షుర కర్మ చేస్తారు. మాదిగలు చెప్పులు కుడతారు. దేవాంగులు బట్టలునేస్తారు. కోమట్లు అంగళ్ళు నడుపుతారు. ఇలా ప్రతి గ్రామంలో రైతులతో పాటు ఈ వృత్తులవారు ఉండుటవలన ఏగ్రామానికాగ్రామం స్యయం పోషకం అయ్యేది.

10. నిత్య జీవనం :

ఎండకూ, వానకూ తలపై గొడుగులు వేసుకొని తిరుగుతారు. ఇవి తాటాకు గొడుగులు. వానకు జమ్ముతో తయారుచేసిన గూడచాపలుకూడా వాడతారు. గాలికోస్ం తాటియాకు విసనకర్రలు, కూర్చొనుటకు తుంగచాపలు జానపదుల వ్యవహార సామాగ్రి.