పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తరువాత ఉప్పుకలీపిన చల్లని మజ్జిగ దాహం ఇస్తారు. ఆపైన వాకిట్లో మంచం వేస్తారు. చాలామంది ఎంతదూరం అయినా నడిచేవెళతారు. అందువల్ల అలసి ఉంటారు. వారు ఆ మంచంమీద కూర్చొనిగాని పడుకొనిగాని సేద తీర్చుకుంటారు. ఇందులో రాజుల మర్యాదసేసి వెలమలు, రాజులు చాపవేసి తమరు దయచేయండంటే తమరు దయచెయ్యండంటూ అందరూ చాపచుట్టూ నేలమీదే కూర్చోవడం విచిత్రం.

2. పెళ్ళీభద్రత:

పిల్లల పెళ్ళీ పెద్దలే నిర్ణయిస్తారు. అందువల్ల వారి నిత్యజీవితంలో వచ్చే పొరపొచ్చాలకు పెద్దలు బాధ్యత తీసుకొని సరిచేస్తారు. అంటే పెళ్ళీకి ఇలా సాంఘిక భద్రత కల్పించబడిందన్నమాట.

3. సెక్సు విజ్ఞానం:

ఇది అతి సులువుగా అందరికీ బోధపడేటట్లు దేవాలయాలపై బూతుబొమ్మలు వేయించడం ఒక పద్ధతి. పెద్దవాళ్ళు పెళ్లయి వయసొచ్చిన బిడ్డల దగ్గర అప్పుడప్పుడు మర్మ గర్భితంగా సెక్సు విషయాలు మాట్లాడటం మరొకపద్ధతి. శోభనం దినాన పెద్ధముత్తైదవులు రతి విషయాన్ని రహస్యంగా వివరించి చెబుతారు స్త్రీకి. పురుషుడికి మగవారితో ఒకరీ బోధపరుస్తారు. ఆ దంపతుల్ని ఆత్యంత సన్నిహితులను చేయడానికి ఒకరు ఎంగిలి చేసిన పాలు మరొకరితో త్రాగించడం వగైరా చేయిస్తారు.

4. ప రి శు భ్ర త :

ఉదయం లేవగానే ప్రతివారూ వారి వీధి తుడిచి పేడతో కళ్ళాపు చల్లి దానిపై ముగ్గులు పెట్టడం మొదటి చర్య. దీనివల్ల పరిసర కాలుష్యం నివారింపబడుతుంది. ముగ్గువల్ల వీధికి అందం రావడమేకాక సూక్ష్మక్రిమిసంహారం జరుగుతుంది. పండుగ పేరుచెప్పి తరుచు ఇల్లు అలుకుట కూడ ఇందుకోసమే.

5. మైల పట్టడం

ఇంట్లో ఎవరికైనా బిడ్డ పుట్టినపుడు పదిరోజులు మైల పాటించి పదవ రోజున పురిటి స్నానం చేయిస్తారు. అప్పటి వరకూ ఆ పురిటి ఇంట్లోకి ఎప్పుడూ వెళ్లరు. వెళ్లినవారు వెంటనే ఆ బట్టలు విడిచి తల స్నానం చేస్తారు. ఆ పురిటిగదిలోని సూక్ష్మక్రిములు బౌయట ప్రపంచం