పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/486

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంద్రదేశంలో సూర్యదేవాలయాలు మూడుచోట్ల ఉన్నాయి. 1) అరసవిల్లి 2)గొల్లమామిడాడ 3) పెద్దాపురం పాండవుల మెట్టమీద. గొల్లమామిడాడలో సూర్యదేవుని ఉత్సవాలు యీసప్తమికి ప్రారంబించి భీష్మఏకాదశివరకూ అయిదురోజులూ అద్బుతంగా చేస్తారు.

               కృ ష్ణా ష్ట మి

“కస్తూరి రంగరంగా,
   నాయన్న కావేటిరంగరంగా“
‘అష్టమీ దినమందునా
    కృష్ణావతారుడై జన్మించెను ‘

శ్రావణంబహుళాష్టమి శ్రీకృష్ణుని జన్మదినం. ఇదే కృష్ణాష్టమి. కృష్ణుడు ద్వాపరయుగం అంతటినీ ప్రభావితంచేసిన గొప్ప మహాత్ముడు.

     “పరిత్రాణాయ సాధూనాం
       వినాశాయచ దుష్కృతతాం
      ధర్మ సంస్థాపనార్దాయ
        సంభవామి యుగే యుగే.”

అనేది గీతావాక్యం. కంసాది రాక్షసులనుగూర్చి, దుర్యోధనాది దుర్మార్గులనుశిక్షించి దర్మరాజువంటి సన్మార్గులకండగానిలిచి ధర్మసంస్థాపనము గావించినాడు. అందుకే అతడుదేవుడు. ఆదిదేవుడు. ఆదేవుడుపుట్టినరోజు పల్లెజనులకు పెద్దపందుగ. బాలకృష్ణుడు చిలిపిచేష్టలతో గొల్లపల్కెనంతటినీ అలరించాడు. గొల్లభామలు పైనఉట్టెలలో దాచుకున్న కుండలలోని పస్లు,పెరుగు,వెన్న ఎగిరి అందుకొని తినెయ్యడం ఓముచ్చట. గొల్లకాంతలు యశొదదగ్గరికొచ్చి-

       “ఓయమ్మ నీకుమారుడు
       మాఇండ్లను పాలుపెరుగు మననీడమ్మా
       పోయెద మెక్కడికయినను“

  అని ఫిర్యాదులు చేసేవారు- ముద్దుగా. ఆ ముద్దుచేష్టలు జ్ఞప్తికివచ్చేలా ఆరోజున గ్రామాల్లో ఉట్లసంబరంచేస్తారు. ఉట్లసంబరమంటే ఆసాయంకాలంవేళ రోడ్డుకిరువైపులా రెండురాటలుపాతి, దానికి కొబ్బరిఆకులుచుట్టి, పైని రెండిటినీకలుపుతూ అడ్డుగా మరొకరాట