పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/466

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సం క్రాం తి వే డు క లు

  • "Festival is a complex unit of customs and other Folklore to celebrate a special occasion usually, and of Public interest".

పండుగలు సమాజంలోని సభ్యులనడుమ సమైఖ్యతని పెంపొందిస్తాయి.

                       ** "మిరపపండ్లకు కుంకుమ మెరపుదాల్చి
                            బంతిపూవుల మొగము అల్లంత విచ్చి
                            మనగృహమ్ముల ధాన్యసంపదలు నిల్చి
                            సరస మధురమ్ము పుష్య మాసంబువచ్చె"

          పుష్యమాసం వచ్చిందంటే తెలుగుపల్లెలు ధాన్యరాసులతో గలగల లాడుతుంటాయి.  గాదులునిండిన రైతన్న పేదసాదలకు సమారాధన ప్రారంభిస్తాడు.  ధనుర్మాసప్రారంభంరోజున పల్లెజనులపరిభాషలో నెల పట్టడం అంటారు.  నెలపట్టినట్టు సంకేతంగా ఆరోజూదయం దేవుడి గుళ్ళో బాజాలు వాయిస్తారు.  స్త్రీలు వీధుల్లో గుమ్మాలముందు ముగ్గులతో సంకురుడు పెట్టడం ప్రారంభిస్తారు.  అంతకంటే ఇంటింటికీ తెలిసే మరో సంకేతం సాతానుజియ్యరు యాచనారంభం.
   ఈ జియ్యరునుగురించి 'కాటూరి, పింగళి " తమ 'తొలకరి ' గ్రంధం లోని "సంక్రాంతి" ఖండికలో ఇలా అంటారు. -

                      "కోడితో మేలుకొని తానమాడి నుదుట
                        తిరుమణియు తిరుచూర్ణము తీర్చిదిద్ది
                        ఒక్కకేలను తంబుర ఒక్కకేల
                        చిరుతలంబూని8 మన్ననిశిరముపైని
                        తొలగకుండగ అక్షయపాత్ర నిలిపి
                        మేలుకొలుపులంబాడి వీధివీధులను దిరిగి
                        యనుపదమ్మును రంగరంగా యటంచు
                        గడపగడపవకునేగి భిక్షమ్ముగొనుచు
                        చేరవచ్చెను సాతాని జియ్యరడిగో".


  • S. D. Fml, Boggs Vol.II P. 1144
    • పింగళి - కాటూరి 'తొలకరి ' నుండి