పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/457

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వివాహం నిర్ణయించేవారు. అందువల్ల యిదే వారికి తొలిచూపు. అంతేగాక కళ్యాణ కళతో కలకలలాడుతూ ఒకరిప్రక్కనఒకరు ఆనందంగా కనిపిస్తుంటే అందరిహృదయాలూ తీయనితలపులతో ఒక్కసారి పులకరించిపోయేవి. ((వారి గతస్మృతులు మరల జ్ఞాపకం వచ్చి), అనంతరం అందరూ అక్షతలుజల్లి వధూవరులనాశీర్వదించేవారు.

                    మాం గ ల్య ధా ర ణం

                              తరువాత పురోహితుడు -
                         "మాంగళ్యం తంతునాసేన మమజీవనహేతువా
                         కంఠే బద్నామి శుభగేత్వం జీవశరదాం శతం"

   అని మంత్రం చదువుతూ మూడుముళ్ళూ వేయిస్తాడు.  నూరేళ్ళు ఇరువురి జీవితాలూ మమతానురగాలతో సుఖశాంతులతో ఒకటిగా కలిసిమెలసి బ్రతకాలనే ఆకాంక్షలతో బంధించే సూత్రంయిది.  ఆపైన వరునిచేత "ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతి చరామి" అనిపిస్తాడు.  పెండ్లికూతురిచేత భర్తచేతికి కంకణం కట్టిస్తాడు.  ఇది వారివురిమధ్య అధికన్యూనత్రా భేదాలులేకుండా సమానాధిక్యత, అరాధనాభావాలు కలుగజేసేసంధానం.  అందుకే ఆనాడు పెళ్ళంటే నూరేళ్ళపంట అన్నారు. (ఇప్పుడు నూరేళ్ళ పంట అంటున్నరనుకోండి)
                                   బ్ర హ్మ ము డి

                      "ఏడేడూజన్మల నుండీ
                       పడివుందీ బ్రహ్మముడీ"

    నేటివివాహం గతఏడుజన్మల అనుబంధంఅని మనవాళ్ళవిశ్వాసం. నేటినుండి వారిద్దరూ ఒకటిగా అంసంధింపబడిరను అంతర్లీనభావానికి దృశ్యరూపమైనసంకేతం యీబ్రహ్మముడి.  ఇదే కొంగుముడి, పెండ్లికూతురుచీరచెంగూ, పెండ్లికొడుకుపంచెకొంగూ కలిపిముడివేసి పురోహితుడు వారిచేతులుకలిపి ఏడడుగులు నడిపిస్తాడు.  అదే సప్తపది. ఆపైన హోమగుండంచుట్టూ ముమ్మారు ప్రదక్షిణంచేయిస్తారు.  అగ్నిహోత్రునికూడా సాక్షినిచేస్తూ, చీలకమర్తివారి గయోపాఖ్యానం నాటకంలో -