పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/453

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెండ్లిజరిగే యింటిముందు తాటియాకు పందిరివేసి, మామిడాకు తొరణాలుకట్టి, స్థంభాలకు కొబ్బరిఆకులుచుట్టి ఆ ప్ర్రాంగణానికి పచ్చదనం చల్లదనం తెస్తే ఆ పందిట్లో స్త్రీలు రకరకాలముగ్గులతో రంగవల్లులు తీర్చిదిద్దుతారు. కొందరు పందిట్లో పలురకాల కాగితపుబుట్టలుకూడా వ్రేలాడదీసి మరింత శోభాయమానంగా అలంకరించేవారు. ఇది ఆయింటిలో పెళ్ళి జరగబోతోందని చెప్పే మూడవ ప్రచారసాధనం. (ఈ మధ్యమైకులు వచ్చాక యీ పందిళ్ళలో "పాడూ జీవితమూ యవ్వనం మూడునాళ్ళా ముచ్చటరోయి" వంటి పాటలుకూడా వినిపిస్తున్నారనుకోండి), పెళ్ళి నాటికి బంధుమిత్రులంతా సపరివారంగా కుటుంబాలతో తరలివచ్చేవారు. పిల్లలదగ్గరనుంచి పెద్దవాళ్ళవరకూ ఎవరినిచూసినా ఖరీదయిన బట్టలూ, సెంటువాసనల ఘుమఘుమలతో యిల్లంతా కలకలలాడిపోయేది. ప్రత్యేకించి స్త్రీలు పట్టుచీరలుధరించి కంటె, కాసులపేరు, వడ్డాణం, నాను, నాగరం, మురుగులు, దండకడియాలు వంటి బంగారుఆభరణాలు వొంటినిండా దిగబోసుకుని (ఎరువుతెచ్చుకొని అయినాసరే) పెళ్ళికళను యినుమడింపజేసేవారు.

    జానపదుల విశేషం కష్టాల్లోనూ, సుఖాల్లోనూ ఒకరికొకదు సాయపడడం పెండ్లిఖర్చు కొంత తాముకూడా భరిందడానికి బంధుమిత్రులు పెళ్ళికొడుకుని చేస్తామనీ, పెళ్ళికూర్ని చేస్తామని వాళ్ళ యిళ్ళకు తీసుకువెళ్ళి విందుచేసి, అత్తరూ పన్నీరూచల్లి, గంధంపూసి, కొత్తబట్టలూ, కొంతకొంత సొమ్మొలూ చేతికిచ్చి పంపించేవారు ఉచితంగా.  పైగా పెళ్ళిభోజనాలకు వావలసిన బియ్యం దంచడంలోనూ (ఆరోజుల్లో బియ్యం మిల్లులు లేవు) పిందివంటలు తయారుచెయ్యడంలోనూ, భోజనాలు వడ్డింపుల్లోనూ ఎంతగానో సహకరించి చాలాఖర్చును తగ్గించేవారు.
                               అ వి రే డు
    ఇక పెళ్ళీనాడు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగావెళ్ళి మొదట గ్రామదేవతలకు పానకాలుపోసేవారు.  ఈ ఊరేగింపులో ఒక శాలువాను నాలుగుమూలలా నలుగురు పట్టుకోగా మధ్యలో కర్రతోగొడుగులా ఒకరు పైకెత్తిపట్టుకొని నడుస్తుంటే పిల్లలందరూ దానిక్రిందచేరి బలె సంబరపడిపోయేవారు.  దీనినిబట్టే యిది పెళ్ళిఊరేగింపని చూడగానే తెలిసి