పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/452

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వి వా హ వే డు క లు

"పప్పుదప్పళాల్ మంచి
అప్పడాల్ భేష్ భేష్"

        ఇవి ఒకనాటి జానపదుల పెళ్ళి భోజనాల్, పప్పు, చారు, దప్పళం, అప్పడం, వడియం, బూరె, ఆవకాయ, అరిసె యివన్నీ ఆకులో ఉండవలసిందే. పాశ్చాత్యనాగరికతాప్రబావాంతో యిప్పుడవన్నీ పోయాయి.  పెళ్ళిళ్ళకు పల్లెల్లోకూడా పలావుభోజనమే ఫేషనయింది.  ఇలాగే పెండ్లి తులుకూడా మారిపోయాయి. ఒకనాడు తెలుగుజానపదుల పెళ్ళిళ్ళు దాదాపు పది పదిహేనురోజుల ముచ్చట.  అది ఆయింటికేకాదు, ఆ వీధికి, ఆవాడకు - ఇంకాస్తగొప్పవాళ్ళయితే ఆఊరికే వేడుక.
  పెళ్ళికి పది, పదిహేను రోజులముందు ఒకశుభముహూర్తాన పసుపు కొట్టడం అనే కార్యక్రమంతో వేడుకలకు అంకురార్పణజరిగేది.  ఆ రోజు పసుపుకొమ్ములు రోటిలోవేసి ఊరిలో ముత్తయిదువుల్ని పిలిచేవారు పేరంటానికి.  ఒక్కొక్కరూవచ్చి రోకటిలో మూడుసార్లువేసి తాంబూలాలు తీసికెళ్ళేవారు.  ఆ రోజుల్లో శుభలేఖలు, ప్రింటింగు వగైరాలులేక లగ్నప్రచారానికి యిదిఒకసాధనంగావుండేది.  ఈపసుపుకొడుతూ పేరంటాండ్రు మంగళకరమైన సీతారాముల పెండ్లివైభవం రోకటొఇ పాటగా పాడేవారు. అలాగ సీతారాముల్లాగ అన్యోన్యదంపతులు కావాలని కాంక్షిస్తూ.
   తరువాతతంతు పెపెళ్ళికూతుర్ని చెయ్యడం, పెళ్ళీకొడుకును చెయ్యడం. ముఖానికి కళ్యాణబొట్టు, బుగ్గనుచుక్క, కళ్ళకుకాటుక, కాళ్ళకు పారాణి, చేతులకు గంధం, కొత్తబట్టలు, సెంటువాసనలు వారికి నూతనోత్సాహాన్ని కలిగింఛెవి.  తనకు పెళ్ళికాబోతోందని నలుగురూ చాటిచెప్పే రెండవ ప్రచార్4అ సాధనంయిది.  ఈరోజునుంచే వారికి మన్ననలు పెరుగుతాయి.  వారిలో ఒకమానసికౌదాత్తత అసంకల్పంగా పెరుగుతుంది.  ఊరూరావున్న బంధువులందరికీ మనుషుల్నిపంపి కబుర్లుపెట్టేవారు.  ఫలారోజు పెళ్ళి, రావాలి అని. సాధారణంగా పెళ్ళి పెళ్ళికూతురింటచెయ్యడమే రివాజు.  పెళ్ళికొడుకు యింటచెయ్యడంకూడా కొన్ని చోట్లవుంది.