పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/436

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బట్టచాకలిబానమీదవేసి కొట్టడంలా ఉంటుంది. కనుక దీనిని చాకలిబాన అన్నారు. ఇందులో మనిషి తనకై తీసుకోవలసిన జాగ్రత్త. అనుశీలన, పరిశీలన అలవడతాయి. దీనినే కొన్నిచోట్ల "చెండాట" అంటారు.

                             కం చి మే క ఆ ట
  ముందుగా పిల్లలు తమలోఒకరిని పులిగానూ, ఒకరిని మేకగానూ నిర్ణయించు కుంటారు.  మిగిలినవాళ్ళంతా చేతులు బారజాపి ఒకరిచేతులు ఒకరుపట్టుకొని వలయంగా నిలబడతారు.  ఆ వలయంలో "మేక" ఉంటుంది.  వలయానికి బయట పులి చుట్టూతిరుగుతూ "కంచిమేకను కాస్తావ్" అంటుంటే మిగతావాళ్ళు "కాలిరగేస్తాం" అంటు కోరస్ గా పాడుతుంటారు.  ఇలా తిరుగుతూ తిరుగుతూ పులి సందుచూసుకుని లోనికిజొరబడడానికిప్రయత్నిస్తుంటే వలయంగా ఉన్నవాళ్ళు చేతులు అడ్దుపెట్టేసి ఆపుచేస్తుంటారు.  ఇంకా బలవంతంగా గెంటుకుని పులి లోపలికివెళ్ళిపోతే లోపలున్నమేకను బయటకొదిలేసి మరల పులిని లోనుంఛిబయటకు రాకుండా కాస్తారు.  పులి బయటకొస్తే మేకలోపలికి పోతుంటుంది.  ఎంతసేపటికీ దొరక్కుంటే పులి ఓటమి ఒప్పేసుకోవాలి.  ఇది బలవంతులనుండి బలహీనులకు రక్షించాలనే నీతిని ప్రబోధించడమేకాక వినోదం కలిగిస్తుంది.
                   దా గు డు మూ త లు
    ఇవి రెండు మూడు రకాలుగా ఆడతారు. వంటలు వేసికొని గొందను ఎన్నుకొంటారు.  దొంగకు కండ్లుమూయడానికి ఒకరిని తల్లిగా నియమిస్తారు.  తల్లి పిల్లలందర్నీ ఎదుటనిలబెట్టి దొంగకు కళ్ళుమూసి "వీరి వీరి గుమ్మడి పండూ  వీరిపేరెవరు?" అని పాటపాడుతూ వారిలో ఒకరిని చూపిస్తుంది.  వారు దొంగ ముక్కుమీద చిన్నగా గిల్లుతారు.  దొంగ వారిపేరు చెప్పలేకపోతే తల్లి "వీరీ నువ్వుపారిపో" అంటుంది.  అలాగే ఒక్కొక్కరినీ చూసి అడుగుతుంది. ఎవరయినా చెప్పగలిగితే వాళ్ళుదొంగగా మారతారు.  ఎవరినీ కూడా చెప్పలేకపోతే తల్లి 'పిల్లి వచ్చే ఎలకా హుత్, ఎక్కడిదొంగలక్కడే, గప్ చిప్" అంటుంది.  అందరూ