పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/435

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాళ్ళదేగెలుపు. ఈ ఆటలో ఒంటికాలితోనూ, రెండుకాళ్ళతోనూ గెంతుతుండవల్ల కాళ్ళకు పరిశ్రమకలుగుతుంది. సరిగ్గా తాము అనుకున్న కానాలోకి చూడకుండా బిళ్ళ విసరడం చీకటిలో కూడా లక్ష్యంమీదికి గురి పెట్టిసాధించడం అలవడజేస్తుంది.

                          తు మ్ముం డ
  పిల్లలందరూ కలిసి వంటలుచేసుకొని దొంగను నిర్ణయిస్తారు. ఆ దొంగ మిగతావారేవరయినా నిలబడిఉండగా ముట్టుకుంటే వాళ్ళు దొంగ అన్నమాట.  అందువల్ల వాళ్ళు దొగకుదొరక్కుండా తప్పించుకుతిరుగుతూ దొరికిపోదామనుకున్నప్పుడు కూర్చుండెపోతారు.  ఆ కూర్చున్నవారినెత్తిమీద చెయ్యిపెట్టి దొంగ "తుమ్ముండ" అంటుంది.  ఆ తరువాత నిలబడిఆడుతున్నవారె వరైనావచ్చి ఆ కూర్చున్నవాళ్ళనెత్తిమీద చెయ్యివేసి "లే" అంటేనే లేవాలి.  అలాలేచి మళ్ళీ ఆటలోపాల్గొనవచ్చును.  ఎవరూవచ్చి వాళ్ళను లేవదీయకుండా చూసుకుంటూ దొంగ ఇతరులను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.  ఇందులో దొంగకు దొరక్కుండాతిరిగే చాకచక్యం, వేగవంతమైనపరుగు అనుకోకుండా అలవడతాయి.
                   చా క లి బా న ఆ ట
       పిల్లలు ఒకవలయంగా, తమవెనుక ఏంజరుగుతుందో తెలియకుండా ముఖాలు క్రిందికివంచుకుని కూర్చుంటారు.  వాళ్ళు "పంటల" ద్వారా నిర్ణయించుకున్న వ్యక్తి వారివెనుక చుట్టూతిరుగుతూ తెలియనివ్వకుండా ఎవరొకరివెనుక రుమాలు చుట్టగా పడవేస్తాడు.  అది ఎవరివెనుకపెట్టబడిందో ఆవ్యక్తి అదిగ్రహిస్తే వెంటనే ఆరుమాలుతీసుకొని దానితో ఆ దొంగను తను కాళీచేసిన స్థలంలోకి వచ్చికూర్చునేవరకూ తరిమితరిమి కొడుతుంటాడు.  ఒకవేళ తనవెనుక రుమాలు పెట్టినట్టు అతనుచూసుకోకుంటే ఆపెట్టినవ్యక్తి చుట్టూతిరిగివచ్చి ఆకూర్చునివున్నవ్యక్తిని ఆరుమాలుతో అతనులేచి వలయం చుట్టూ తిరిగివచ్చి తనయధాస్థానంలో కూర్చునే దాకావెంబడించికొడతాడు.  ఇలాగ మరొకరివెనుకా మరొకరివెనుకా రుమాలు పెడుతూ ఆట మంచిరంజుగా సాగిస్తారు.  రుమాలుతో వీపుమీద బాదడం