పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/434

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
  • ఈఆటను కళాపూర్ణోదయ, హంసవింశతికారులు పేర్కొని యున్నారు.

                                ** సరిలేని ఎంచి పొగలూ
                                    అరుదగు జాదంబునుత్త మచ్చన గుండ్లున్
                                    దిరమగు వోమన గుంటలు
                                    సరసత మీనాడు చున్న సతులంగనియెన్ '

                           తొ క్కు డు బి ళ్ళా ట
     నేలమీద సుద్దతో దాదాపు అయిదుమీటర్లపొడవుగీతగీసి, దానిని సమానంతరంగా ఒకమీటరుదూరంలో మరోగీతగీసి, వానిమధ్యకాళీని అయిదుసమభాగాలుగావిభజించి గీతలుగీస్తారు.  రెండవ జాగాలోనూ, నాలుగవజాగాలోనూ మధ్యగా నిలువుగీతగీసి వానిని మరల రెండేసిభాగాలుగా విభజిస్తారు.  ఈ భాగాలకు 'కానా ' లని, 'జాగాలని ', "కాళీ"లని పర్యాయపదాలు.  గీతలకు 'గిరి '. 'బిరి ' అని పరిభాష. ఆట ప్రారంభించే వ్యక్తి మొదటిజాగాకు ఈవలనిలిచివెనక్కితిరిగి, తన తలమీద నుంచి ఒక పెంకుముక్కను ఈ జాగాలోకి విసురుతారు.  (ఈపెంకుముక్కే "బిళ్ళ") అది ఏ జాగాలోనూపడకుండా బయటపడినా, గీతమీదపడినా తనఆట పోయినట్టే.  మొదటిజాగాలోపడితే రెండవజాగాలోవున్న రెండు భాగాలలోకీ రెండుకాళ్ళూపడేటట్టు గెంతి, అక్కడనుంచి మూడవజాగాలో ఒంటికాలు, నాలుగవజాగాలోని రేండుబాగాలలో రెండుకాళ్ళు, అయిదవ జాగాలో ఒంటికాలు వేసి, వెనక్కి వనక్కి తిరిగి, వెళ్ళినరీతిగానే మరలగెంతుతూ వచ్చి ఒకటవ ఒకటవ కానాలోనిబిళ్ళమీద ఒంటికాలువేసి, దానినితీసి ముద్దిడుకొని గిరిదాటి వస్తారు.  ఇలాగెంతేటప్పుడు ఏగిరిమీదా కాలుపడకుండా, ఎక్కడా వరుసతప్పకుండా చేస్తే మొదటికానా తనకు పండిందన్నమాట.  ఇలాగే అన్నికానాలూ పండించాలి.  ఎప్పుడు తప్పుఆడితే అప్పుడు ఆటపోయినట్టు. అప్పుడు రెండవ్యక్తి మొదటివ్యక్తిపండించిన కానాలో అడుగుపెట్టకుండా అవతలకానాలోకిదుమికి మిగిలివున్న కానాలుపండిస్తార్.  ఒకవ్యక్తి పండించిన దానిలో రెండోవ్యక్తి కాలిడరాదు.  అలా ఎవరు ఎక్కువకానాలుపండించి ఎదుటివారిగమనాన్ని ఆపగలుగుతారొ

  • క్రీడలు పు. 1442 ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. ** భోజ రాజీయము.